Ajith Kumar: సాధారణంగా ఏదైనా స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ హడావుడి చేస్తుంటారు. వారి అభిమాన హీరో మీద ప్రేమని కటౌట్ రూపంలో చూపిస్తారు. ప్రస్తుతం, ఇది బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం హీరోలకి సంబందించిన ఎన్నో భారీ భారీ కటౌట్ లు చూశాము. అయితే, ఎప్పుడూ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. మొదటి సారి కోలీవుడ్ స్టార్ హీరో భారీ కటౌట్ కుప్పకూలడం అందర్ని షాక్ కి గురి చేసింది. మరి, ఆ హీరో ఎవరు? ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: SriRamaNavami Shobhayatra: హైదరాబాద్లో ప్రారంభమైన శోభాయాత్ర.. మారుమోగుతున్న శ్రీరాముని నినాదాలు
టాలీవుడ్ లో మెగాస్టార్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో? కోలీవుడ్ లో స్టార్ హీరో అజిత్ కి కూడా అలాంటి ఫ్యాన్ బేసే ఉంది. ఇటీవలే విదాముయార్చి తో ప్రేక్షుకుల ముందుకొచ్చిన అజిత్.. ఇప్పుడు, గుడ్ బ్యాడ్ అగ్లీ అనే కొత్త కాన్సెప్ట్ తో మరోసారి సందడి చేయనున్నారు. ప్రస్తుతం, ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి.
ఇంకో వైపు మూవీని ప్రమోషన్స్ చేసేందుకు చిత్రం బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నెల్లైలోని బిఎస్ఎస్ సినిమా అజిత్ కొత్త చిత్రం కోసం ఏకంగా 285 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే, ఏం జరిగిందో తెలీదు.. ఒక్కసారిగా కటౌట్ కుప్పకూలింది. సమయానికి దగ్గర్లో ఎవరూ లేరు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు.అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఏప్రిల్ 10వ తేదీన విడుదల కానుంది. హీరోయిన్ త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కు అందించారు.
Also Read: Government on HCU Land: ఆ భూముల్లో వన్యప్రాణులున్నాయ్.. 400 ఎకరాలలో కాదు.. ప్రభుత్య అధికారుల వివరణ
ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్‌కు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే మూవీ టికెట్స్ బుకింగ్స్ కూడా మొదలైంది. ఇక ఫ్యాన్స్ అయితే ప్రీమియర్ షోలకు రెడీ అవుతున్నారు. మరి, ఈ మూవీతో అజిత్ హిట్ కొట్టి తన మార్కెట్ ను పెంచుకుంటారో? లేదో చూడాల్సి ఉంది.