EPIC First Semester: ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజైన ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్య తరగతి కుటుంబాలలోని అనుబంధాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించిన ఈ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులు తమ గుండెల్లో పెట్టుకుని మరీ ఆదరించారు. ఇప్పుడీ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘సినిమా’ రాబోతోన్న విషయం కూడా తెలిసిందే. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’లోని బుడ్డోడు రోహన్ రాయ్ (సిరీస్‌లో శివాజీ చిన్న కొడుకు పాత్రలో నటించాడు) పెద్దై, ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో.. రచయిత, దర్శకుడు ఆదిత్య హాసన్ (Aditya Haasan) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’ (EPIC – First Semester) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. రోహన్ రాయ్ (Rohan Roy) పాత్రలో నటించే హీరో ఎవరో కూడా ఇప్పటికే మేకర్స్ రివీల్ చేశారు. ఆనంద్ దేవరకొండ ఈ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Naga Chaitanya: సమంతతో విడాకులపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇప్పుడిదే టాక్!
ప్లాన్ వర్కవుట్ అయినట్లే
ఈ టీజర్‌ను గమనిస్తే.. ఇందులో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)కు లవర్ పాత్రలో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటిస్తున్నారు. (ఆల్రెడీ ఆనంద్, వైష్ణవి కాంబోలో వచ్చిన ‘బేబి’ ఎలాంటి సక్సెస్ అందుకుందో, ఎన్ని అవార్డులను కొల్లగొట్టిందో.. అందరికీ తెలిసిందే). క్లాస్ జంటగా పేరున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య మరోసారి కలిసి నటిస్తుండటంతో.. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడొచ్చిన టీజర్ కూడా ఆ అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఇందులో ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ రోహన్ రాయ్ సీన్లను కూడా యాడ్ చేయడం విశేషం. అంటే త్వరగా జనాలు పాత్రని రిజిస్టర్ చేసుకోవడం కోసం.. చాలా తెలివిగా మేకర్స్ ప్లాన్ చేశారు. వారి ప్లాన్ వర్కవుట్ అయినట్లే భావించాలి. అప్పటి రోషన్ రాయ్‌కి, ఇప్పటి ఆనంద్ దేవరకొండకు తింగరితనంలో ఏం తేడా లేదనేలా ఈ టీజర్‌ని కట్ చేశారు.
Also Read- Bigg Boss Telugu 9: తనూజ, ఇమ్ము ఏడిపించారు కదయ్యా.. జోక్ అంటారేంటి? ఫైరింగ్ నామినేషన్స్
ఎలాంటి అబ్బాయి కావాలి?
లండన్‌లో మాస్టర్స్ పూర్తి చేసినట్లుగా హీరోయిన్ వైష్ణవి చైతన్యను రివీల్ చేశారు. ‘మాస్టర్స్ అయిపోయింది. ఇప్పుడు మన తెలుగు ఆచారం ప్రకారం పెళ్లే నెక్ట్స్’ అని వైష్ణవి ఫ్రెండ్ చెబుతుంటే.. ‘నాకయితే పెళ్లి ఇష్టం లేదు.. కానీ పేరేంట్స్ కోసం తప్పదు’ అని వైష్ణవి చెప్పగా.. ‘ఎలాంటి అబ్బాయి కావాలి?’ అని ఫ్రెండ్స్ ఆమెను ప్రశ్నించారు. ‘మంచి డ్రస్సింగ్ సెన్స్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బ్యూటీఫుల్ మ్యూజిక్ టేస్ట్ ఉండాలి. అకాడమికలీ టూ ఇంటిలిజెంట్ అయ్యిండాలి’ అని తన రిక్వైర్‌మెంట్స్ చెబుతుంది. అయితే దొరుకుతాడు అని ఫ్రెండ్ అనగానే.. ‘దొరికేశాడు’ అని వైష్ణవి చెబుతుంది. కట్ చేస్తే.. హీరో గద్దర్ గెటప్‌లో లండన్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వస్తున్నాడు. గోరెటి వెంకన్న ‘అంగిలేని అంటిపై గొంగలేసుకొండు’ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోంది. ఫైనల్‌గా ఇది శేఖర్ కమ్ముల సినిమాలోని హీరోలాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాలోని హీరోయిన్ లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ అని ఆనంద్ దేవరకొండ చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగించారు. ఈ టీజర్‌తో సినిమాపై ఎలాంటి హైప్ రావాలో.. అలాంటి హైప్‌ని కలిగించారని అనుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
