3 Roses Season 2: ‘లైఫ్ ఈజ్ ఏ గేమ్’ సాంగ్ వచ్చింది.. చూశారా? | Swetchadaily | Telugu Online Daily News
3 Roses Season 2 (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

3 Roses Season 2: ‘లైఫ్ ఈజ్ ఏ గేమ్’ సాంగ్ వచ్చింది.. చూశారా?

3 Roses Season 2: ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 (3 Roses Season 2) డిసెంబర్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్‌ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా.. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఇటీవల వచ్చిన టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని, ఈ సిరీస్‌పై అంచనాలను పెంచేయగా, తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి ‘లైఫ్ ఈజ్ ఏ గేమ్’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట వివరాలకు వస్తే..

Also Read- Balakrishna: ‘నన్నే అంటి పెట్టుకున్నారు’.. బాలయ్య భార్య మాటలు హరికృష్ణను ఉద్దేశించా.. లేక?

ముగ్గురు హీరోయిన్లు హీట్ పుట్టించేశారు

‘లైఫ్ ఈజ్ ఏ గేమ్’ పాటకు భాస్కరభట్ల రవికుమార్ ఇన్స్‌పైరింగ్ లిరిక్స్ రాయగా, లిప్సిక ఆ పాటను ఆలపించారు. అజయ్ అరసాడ సంగీతం అందించారు. ఈ సాంగ్‌లో మెయిన్ లీడ్ నటీమణులైన ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఈ సాంగ్‌ను రూపొందించారు.
‘లైఫ్ అంటేనే ఆగని ఆట,
కథ ముగిసేది ఆగిన చోట,
గెలుపే లేని పందెం ఉందా,
నేడో రేపో పరిచయమవనంటుందా,
ఎన్నాళ్లు ఎన్నాళ్లు ఎన్నాళ్లిలా,
కల జారిపోతుంటే కన్నీళ్లలా,
కల్లాలు సంకెళ్లు తెంచాలిగా,
నీ లైఫ్ , నీ బాసు నువ్వేగా..’ అంటూ సాగిన ఈ పాటలో ముగ్గురు హీరోయిన్లు హీట్ పుట్టించేశారు. మల్టిపుల్ లొకేషన్స్‌లో గ్రాండ్‌గా ఈ పాటను పిక్చరైజ్ చేసినట్లుగా సాంగ్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ పాట తర్వాత ఈ సిరీస్‌ను చూడాలనుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ పాటలో కుర్రాళ్లకు కావాల్సిన ట్రీ‌ట్‌ని ముగ్గురు హీరోయిన్లు ఇచ్చేశారు.

Also Read- Love Days: ‘గీతాంజలి’, ‘తొలి ప్రేమ’, ‘అందాల రాక్షసి’ తరహాలో.. ఈసారి ప్రేమ కథతో వస్తోన్న ‘రాచరికం’ దర్శకుడు

యూనిక్ కాన్సెప్ట్‌తో..

ఈ సిరీస్ గురించి ఇటీవల జరిగిన వేడుకలో నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ఈ కాన్సెప్ట్‌తో ఎన్ని సిరీస్‌లైనా చేయవచ్చు. అలాంటి యూనిక్ కాన్సెప్ట్ మారుతి ఇచ్చారు. సీజన్ 1ను మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సీజన్ 2 లో చూస్తారు. ఫస్ట్ సీజన్ రవి నంబూరి డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తను మా ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ రూపొందిస్తున్నాడు. ఆయన సజెషన్ మీదే కిరణ్‌ను డైరెక్టర్‌గా, సందీప్‌ను రైటర్‌గా తీసుకున్నాం. ఈ సిరీస్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను సందీప్ క్రియేట్ చేశాడు. ఈషా మన తెలుగు హీరోయిన్లలో ఓజీ అనుకోవచ్చు. రాశీ సింగ్ తెలుగు నేర్చుకుని నటిస్తోంది. కుషిత టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయి. నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్నాను. అజయ్ అరసాడ మ్యూజిక్ వింటే నాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాదే గుర్తొస్తాడు. ఈ సిరీస్ కోసం మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డాల్బీ సౌండ్‌లో ఈ సిరీస్ చేశాం. డిసెంబర్ 12న ‘త్రీ రోజెస్’ సీజన్ 2 వస్తుంది. ఆహాలో చూసి ఎంజాయ్ చేయండని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Electric SUV: అత్యంత వేగమైన ఎలక్ట్రిక్ SUV ఇదేనా?

Jogipet News: ప్రజల దృష్టిని ఆకర్షించేలా చేసిన ఓ యువకుడు.. గుర్రంపై వచ్చి నామినేషన్!

Shocking Video: 20 అడుగుల గోడ దూకి.. సింహాల బోనులోకి వెళ్లాడు.. తర్వాత ఏమైదంటే?

Modi vs Priyanka: ప్రధాని మోదీ వర్సెస్ ప్రియాంక గాంధీ.. మాటల తూటాలు.. మోదీ ఏమన్నారో తెలుసా?

CM Revanth Reddy: హడ్కో ఛైర్మ‌న్ సంజ‌య్ కుల‌శ్రేష్ఠ‌తో సీఎం రేవంత్ భేటి.. కీలక అంశాలపై చర్చ