Viral Video : మనుషులు రాను రాను దారుణంగా తయారవుతున్నారు. చిన్న చిన్న వాటికే అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ హింసలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా యూపీలో కూడా ఇలాంటి దారుణమైన ఘటననే చోటుచేసుకుంది. యూపీలోని (Up) డియోరియాలో ఓ యువకుడు తమ ఫోన్ ను దొంగిలించాడని ముగ్గురు వ్యక్తులు కలిసి అతన్ని చిత్రహింసలు పెట్టారు. అతన్ని సోఫా మీద పడుకోబెట్టి ఒక వ్యక్తి అతని తల భాగం మీద కూర్చని పైకి లేవకుండా అదిమి కూర్చున్నాడు.
మరో వ్యక్తి అతని ప్యాంటు కిందకు విప్పి నడుము భాగానికి కింద బెల్టుతో దెబ్బలు కొడుతూ రాక్షసానందం పొందుతున్నాడు. బాధితుడు ఎంత తల్లడిల్లినా సరే అస్సలు వదలిపెట్టుకుండా కాలితో తంతూ కక్ష తీర్చుకున్నారు. ఇదంతా మూడో వ్యక్తి వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దాన్ని చూసిన వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.