UP Crime: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని నలుగురు పిల్లలను కన్న తండ్రే అతి దారుణంగా కడతేర్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. షాజహాన్ పూర్ లోని మాన్పూర్ చాచారి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పిల్లలను అత్యంత పాశవికంగా చంపాల్సిన అవసరం ఆ కసాయి తండ్రికి ఏమి వచ్చిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
