Transgenders Clash: రెండు గ్రూపులు.. అటురాళ్లు ఇటు రాళ్లు.. మధ్యలో పోలీసులు.. గంటసేపు అంతా ఉత్కంఠత.. ఏం జరుగుతుందో తెలియని ఆందోళన.. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉపక్రమించినా మాట వినని పరిస్థితి.. ఎట్టకేలకు పోలీసులు లాఠీచార్జి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ఈ గ్రూపు తగాదాలకు పాల్పడింది ఎవరో తెలుసా సాక్షాత్తు హిజ్రాలు. ఈ ఘటన ఏపీలో జరగగా ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఏపీలోని నంద్యాలలో హిజ్రాల మధ్య వర్గ భేదాలు గత కొంతకాలంగా నడుస్తున్నాయి. భిక్షాటనకు సంబంధించి హద్దులు తీసుకున్న వీరు తమ పరిధిలోకి రావద్దంటూ ఒకరికొకరు నిర్ణయించుకున్నారు. అయితే కొంతమంది హిజ్రాలు పరిధి దాటి భిక్షాటన చేస్తుండడంతో వివాదానికి దారితీసింది. ఈ వివాదమే చివరకు రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణకు కారణమైంది.
హిజ్రాల మధ్య విభేదాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగి అవకాశం ఉందని ముందే గ్రహించిన పోలీసులు ఎవరైనా శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. హిజ్రాలు మాత్రం ఆవేశానికి లోనయ్యారు. ఏకంగా నంద్యాల రూరల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ముందే కారంపొడి చల్లుకొని రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు జరుగుతున్నంతసేపు పోలీసులు వారినించేందుకు శ్రమించాల్సి వచ్చింది.
ఎంత శ్రమించినా మాట వినని హిజ్రాలు దాడులు మాత్రం అలాగే కొనసాగించారు. ఎట్టకేలకు పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 100 మంది హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. భిక్షాటన విషయంలో గతంలో కూడా హిజ్రాల మధ్య వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.
Also Read: Hyderabad Crime: పసికందు చేసిన పాపమేమి? బిడ్డను బకెట్ లో ముంచి మరీ చంపిన తల్లి
అయితే పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాల్సిన వీరు, తమ వివాదాన్ని రచ్చకు ఈడ్చడంతో ప్రస్తుతం ఈ విషయం నంద్యాల జిల్లాల సంచలనంగా మారింది. అంతేగాక హిజ్రాలు పోలీస్ స్టేషన్ ముందే ఘర్షణకు పాల్పడడం పై పోలీసు ఉన్నతాధికారులు సైతం వివరాలు ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. స్థానికులు మాత్రం హిజ్రాలు ఘర్షణకు పాల్పడి ఉద్రిక్తత వాతావరణం సృష్టించారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.