Nagar karnool tribal woman harassment
క్రైమ్

Telangana:ఆదివాసీ మహిళపై అమానవీయ ఘటన

  • పది రోజులుగా చెంచు మహిళ గృహ నిర్బంధం
  • భర్తతో గొడవపడి విడిగా ఉంటున్న మహిళపై పాశవిక చర్య
  • పొలాన్ని కౌలుకిచ్చిన యజమానులు
  • భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న మహిళపై దౌర్జన్యం
  • వివస్త్రను చేసి మర్మాంగంలో పచ్చి కారం పెట్టి చిత్రహింసలు
  • పది రోజులుగా భార్య కనబడటం లేదని భర్త ఫిర్యాదు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దుర్ఘటన
  • ఘటన వెనుక ముగ్గురు నిందితులు
  • కొల్లాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
  • నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కొల్హాపూర్ పోలీసులు

tribal women harassed brutenly in Nagar karnool district by 3 accused:

కొల్లాపూర్,స్వేచ్ఛ:

సభ్యసమాజం తలదించుకునే అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పది రోజులుగా ఓ ఇంట్లో చెంచు మహిళను నిర్బంధించి విచక్షణా రహితంగా కొట్టి ఒళ్లంతా వాతలు పెట్టారు. ఈ పాశవిక చర్య నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొతచింతపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం..స్థానిక చెంచు భ్రమరాంబ కాలనీకి చెందిన కాట్రాసు ఈదన్న ఈశ్వరమ్మలు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో ఈశ్వరమ్మ ఊరు విడిచి వెళ్ళింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ గ్రామంలో తనకు తెలిసిన వారితో భర్త వాకప్ చేశాడు. అయితే తమ పొలాన్ని కౌలుకు చేస్తున్న అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ బండి శివుడు సలేశ్వరం ఈశ్వరమ్మ తల దాచుకున్న సమాచారం తెలుసుకున్నారు. ఈ ముగ్గురూ రహస్యంగా బైకుపై వచ్చి బాధితురాలిని మొలచింతపల్లి గ్రామానికి తీసుకొస్తూ మార్గమద్యంలో ఆమెను ఓ ఇంట్లో నిర్భంధించి ఒళ్లంతా కాల్చి వాతలు పెట్టారు. ఆమెను వివస్త్రగా చేసి పచ్చికారం తెచ్చి నూరి శరీరంపై, మర్మాంగంలో, కళ్లలో చల్లారు. ఆ బాధలకు తాళలేక బాధితురాలు రోదించింది. చుట్టుపక్కల ఏ ఒక్కరూ స్పందించకపోవం విచారకరం. ఇక్కడ ఇంత జరుగుతున్నా తనభార్య ఈశ్వరమ్మ ఆచూకీ మాత్రం భర్త ఈదన్నకు తెలియకపోవడం గమనార్హం. తన భార్య పది రోజుల నుంచి కనబడటం లేదని భర్త ఈదన్న గ్రామస్తులకు తెలపడంతో ఈ పాశవిక చర్య గురించి అక్కడా ఇక్కడా వినబడటంతో అసలు విషయం బయటపడింది. నమ్మకస్తులే ఈ ద్రోహానికి పాల్పడటం శోచనీయం.

జరిగిందేమిటి?

కాట్రాసు ఈదన్నకు ఉన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ ,బండి శివుడులు కౌలు తీసుకొన్నారు. అయితే సదరు కౌలుదారులు ఆ చెంచు దంపతులను తమ పొలం వద్దనే జీతం పెట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు. భార్యాభర్తల గొడవ కారణంగా భార్య ఈశ్వరమ్మ ఇల్లు విడిచి వెళ్లడంతో సదరు దుర్మార్గులు ఇందులో తలదూర్చి కిరాతకానికి పాల్పడ్డారు.

రంగంలోకి పోలీసులు!

నల్లమల అటవీ తీర ప్రాంతంలోని మొలచింతపల్లి చెంచు భ్రమరాంబ కాలనీకి చెందిన కాట్రాసు ఈశ్వరమ్మ, అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ ,బండి శివుడు సలేశ్వరంల చేసిన దారుణ సంఘటనను గ్రామస్తులు పోలీసులకు బుధవారం సాయంత్రం సమాచారం అందించారు. దీంతో కొల్లాపూర్ పోలీసులు గ్రామానికి చేరుకొని నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఈశ్వరమ్మను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు కొల్లాపూర్ ఎస్సై హృషికేష్ తెలిపారు. ఇది ఇలా ఉండగా మొలగింతపల్లిలో దుర్మార్గుల చేత అఘాయిత్యానికి గురైన చెంచు కాట్రాసు ఈశ్వరమ్మకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివాసి చెంచుల సంఘం జిల్లా రాష్ట్ర నాయకులు గురువారం ములచింతపల్లి గ్రామానికి రానున్నట్లు సమాచారం.

Just In

01

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు