Boy died after stuck in Lift: హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ప్రమాదవశాత్తు ఇరుక్కు పోయిన అర్నవ్ అనే ఆరేళ్ల బాలుడు శనివారం మృతి చెందాడు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన అతన్ని పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం ఎంతో శ్రమించి కాపాడి శుక్రవారం నీలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. అనుకోని ప్రమాదంలో చిక్కుకొని భయంలో విలవిలలాడిన ఆ చిన్నారిని చూసిన ప్రతి ఒక్కరు… అతను నిండుగా చిరునవ్వుతో బయటికి రావాలని ప్రార్థించారు. కానీ ఆశలు అడియాసలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్నవ్ కన్నుమూశాడు. అతన్ని బతికించడానికి తీవ్రంగా శ్రమించామని వైద్యులు చెబుతున్నారు.
అసలేలా జరిగిందంటే…
ఆగాపుర గోడేకిఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్ అనే వ్యక్తి కుమారుడు అర్నవ్(6). శుక్రవారం మధ్యాహ్నం తాతయ్యతో కలిసి మాసాబ్ ట్యాంకు లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లాడు.అపార్ట్ మెంట్ మూడో అంతస్తు నుంచి కిందకు దిగే క్రమంలో ఒక్కసారిగా లిప్ట్ కు గోడకు మధ్య ఇరుక్కుపోయాడు. దాదాపు రెండు గంటల పాటు నరక యాతన అనుభవించాడు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, డీఆర్ ఎఫ్ సిబ్బంది శ్రమించి కట్టర్లతో లిఫ్ట్ గ్రిల్స్ ను కత్తిరించి బాలుడిని బయటికి తీసి నీలోఫర్ కు తరలించారు. అయితే.. . దాదాపు రెండు గంటల పాటు గోడకి లిఫ్టుకు మధ్యలో ఇరుక్కు పోయినందు వల్ల అతని పొట్ట, వెన్నుభాగంలో తీవ్ర గాయలైనట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో వెంటిలేటర్ పై చికిత్స అందించామని అయినా పరిస్థితి విషమించడంతో మరణించినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి
SLBC Tunnel Accident: ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం… సొరంగం లోపల 40 మంది కార్మికులు