state co operative bank manager:నమ్మించి..నట్టేట ముంచింది
cheating 200 crores scam
క్రైమ్

Hyderabad:నమ్మించి..నట్టేట ముంచింది

  • అధిక వడ్డీ ఆశ చూపెట్టి రూ.200 కోట్లు వసూలు చేసిన నిమ్మగడ్డ వాణి బాల
  • తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో జీఎంగా పనిచేస్తున్న వాణిబాల
  • శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పెరు తో వినియోగదారుల మళ్లింపు
  • బ్యాంకుకు దగ్గరలోనే భర్తతో కలిసి ఆఫీసు ఏర్పాటు
  • వాణి బాల మాట నమ్మి మోసపోయిన 517 మంది
  • కేసు నమోదు చేసుకున్న బషీర్ బాగ్ పోలీసులు
  • భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్ష లపై కేసు
  • వాణిబాలను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Telangana state co operative bank manager nimmagadda vani bala:
వడ్డీల రూపంలో రెండు వందల కోట్ల రూపాయలు దండుకుని బిచాణా ఎత్తివేసిస సంఘటన హైదరాబాద్ లో జరిగింది. అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో నిమ్మగడ్డ వాణి బాల అనే మహిళ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. పనిచేస్తున్న బ్యాంకుకు సమీపంలోనే తన భర్తతో కలిసి వాణిబాల శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ అనే పేరుతో ఓ ఆఫీసు ప్రారంభించింది. తన బ్యాంక్ కు వచ్చి డిపాజిట్ చేయాలనుకున్న వినియోగదారులను అక్కడికి డైవెర్ట్ చేసేవారు. ఇక్కడి కన్నా అధిక మొత్తంలో వడ్డీ ఇస్తారని చెప్పి తన భర్త నడిపిస్తున్న శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ లో డిపాజిట్ చేయించారు. ఇలా వినియోగదారులను పక్కతోవ పట్టించి వాళ్లకు అధిక మొత్తంలో వడ్డీ ఆశచూపి దాదాపు 517 మంది వద్దనుంచి డిపాజిట్లు సేకరించారు.

కార్యాలయం తాళం వేసి ఉండటంతో

కొంతకాలంగా శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ కార్యాలయం తాళం వేసి ఉండటంతో తాము మోసపోయామని వినియోగదారులు గ్రహించారు. శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ మూసివేయడంతో తమకు న్యాయం చేయాలని వినియోగదారులు బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సిసిఎస్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. డిపాజిట్ ల రూపంలో తీసుకొని అధిక వడ్డీలు ఇస్తామని నమ్మబలికి 517 మంది వద్ద ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని , దాదాపు 200 కోట్ల రూపాయలు వసూలు చేసిందని కంప్లైంట్ చేయడంతో నిమ్మగడ్డ వాణి బాల, ఆమె భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు ఈ కుంభకోణంలో నిందితులుగా పోలీసులు చేర్చారు. ప్రస్తుతానికి నిమ్మగడ్డ వాణి బాల కుటుంబం మొత్తం పరారీలో ఉంది. విషయం తెలుసుకుని ఆమెను సస్పెండ్ చేశారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..