Gutka ban telangana
క్రైమ్

Hyderabad:తెలంగాణలో గుట్కా నిషేధం

Telangana government ban the gutka, pan masala immediately :
గత అసెంబ్లీ ఎన్నికలలో అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చీ రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చీ రాగానే ఆరోగ్యశ్రీ సేవల విలువను రూ.10 లక్షలకు పెంచిన సంగతి విదితమే. అలాగే యువతపై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలోనే తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకంను నిషేదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేశారు. ఇకపై గుట్కా, పాన్ మసాల తయారీ, అమ్మకాలపై తెలంగాణ ప్ర‌భు.త్వం విధించింది. పొగాకుతో పాటూ నికోటిన్ ఉత్ప‌త్తుల‌ను అమ్మ‌డంతో పాటూ స్టోర్ చేయ‌డం కూడా నేరంగా పరిగ‌ణించ‌నున్నారు.

తక్షణమే అమలు

తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులో.. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30 లోని సబ్-సెక్షన్ (2)లోని క్లాజ్ (ఎ) కింద అందించబడిన అధికారాలను అమలు చేయడంలో 2,3,4 ఆహార భద్రత, ప్రమాణాలు (అమ్మకాలపై నిషేధం, పరిమితి) రెగ్యులేషన్ 2011 ప్రజారోగ్య దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, పొగాకు,నికోటిన్‌లను పొగాకు/ పౌచ్‌లు/ ప్యాకేజీ/ కంటెయినర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా/పాన్‌మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించిబడింది. ఈ నిషేధం 24 మే 2024 నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను అన్ని పోలీస్ క‌మిష‌న‌రేట్లతో పాటూ ఆర్టీసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల‌కు పంపించారు. ఆర్టీసీ బ‌స్సులు, ట్రైన్ల‌లో పాన్ మ‌సాలాలు, గుట్కాల‌ను ర‌వాణా చేయ‌డంపై కూడా నిషేదం ఉంటుంది. దీనిపై అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో గుట్కాలు, పాన్ మ‌సాలాల‌పై నిషేదం ఉంది.

Just In

01

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే

Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 32 వేల 520 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు