Suryapet
క్రైమ్, హైదరాబాద్

Suryapet | తల్లితో సహజీవనం.. కూతుర్లపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ కు HIV..!

Suryapet  |సూర్యాపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తల్లి, కూతుర్ల జీవితాలతో ఓ ప్రభుత్వ టీచర్ చెలగాటం ఆడాడు. విద్యా బుద్ధులు నేర్పించాల్సింది పోయి.. కామక్రీడను సాగించాడు. ఓ వైపు తల్లితో సహజీవనం చేస్తూ.. ఆమె బిడ్డలను అత్యాచారం చేశాడు. సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ దగ్గర్లో ఉండే హైస్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య కొన్నేళ్ల కింద చనిపోయింది.

అదే పట్టణంలో ఓ మహిళ తన భర్తతో విడిపోయి తన 15, 19 ఏళ్ల కూతుర్లతో కలిసి ఉంటుంది. ఆమెతో సునీల్ కుమార్ 2018లో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. క్రమంగా అది సహజీవనానికి దారి తీసింది. అప్పటి నుంచి తరచూ ఆ మహిళ ఇంటికి వెళ్తూ వస్తున్నాడు. తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె కూతుర్లపై సునీల్ కన్నేశాడు. తల్లి ఇంట్లో లేని టైమ్ లో ఆమె కూతుర్లపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.

తరచూ ఆ బాలికలపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు సునీల్. ఈ క్రమంలోనే అతను టెస్టులు చేయించుకోగా.. హెచ్ ఐవీ పాజిటివ్ అని తేలింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరకు బాలికలకు తెలిసింది. దాంతో తమ మీద అతను అత్యాచారం చేస్తున్నాడని తల్లికి చెప్పారు. దీంతో ఆమె తన కూతుర్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సునీల్ కుమార్ కు గతంలోనే హెచ్ ఐవీ ఉందని.. ఆ విషయాన్ని దాచి పెట్టి సహజీవనం చేస్తున్నాడంటూ స్థానికులు చెబుతున్నారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు