Students Youths Are Becoming Addicts Of Ganja are supplied in a new way in Hyd
క్రైమ్

Telangana : రూటు మార్చుకుంటున్న ‘గంజాయి’

‘గంజా’ మిల్క్ షేక్. పేరుతో సరఫరా
గంజాయి స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ
పాలల్లో కలుపుకుని తాగితే ఆరోగ్యం అంటూ ప్రచారం
తాగిన 7 గంటలదాకా మత్తు ఉంటుందని యువతకు ఎర
కేజీ పౌడర్ 2,500 రూపాయలకు అమ్మకం
జగద్గిరిగుట్ట ప్రాంతంలో కిరాణా దుకాణంలో అమ్మకాలు
సరుకు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Students Youths Are Becoming Addicts Of Ganja are supplied in a new way in Hyd: గంజాయి.. ఎంజాయ్‌. అంటోంది నేటి యువత .. చాలా మంది యువకులు గంజాయి మత్తుకు బానిసలైపోతున్నారు.ఆ పొగ పీల్చనిదే ఉండలేకపోతున్నారు.తల్లిదండ్రులు శ్రద్ధగా చదువుకోమని పంపిస్తే పక్కదారి పడుతున్నారు.చదువును పక్కన పెట్టి మత్తులో మునిగితేలుతున్నారు. కళాశాలలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గంజాయి వినియోగం పెరుగుతున్నట్టు సమాచారం..పోలీసులకు చిక్కకుండా పలు మార్గాల్లో గంజాయిని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో గంజాయిని లిక్విడ్‌ రూపంలో కూడా సరఫరా చేస్తు న్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకో వచ్చు. నిన్న మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన గంజాయి వ్యా పారం మెల్లమెల్లగా గ్రామాలకు పాకుతోంది.

రకరకాల రూపాలలో అమ్మకాలు

యువతను మత్తు ఊబిలోకి దింపేందుకు గంజాయి స్మగ్లర్లు కన్నింగ్ ఐడియాలతో స్కెచ్‌లు వేస్తూ జోరుగా దందా చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గంజాయి ముడిసరుకును పౌడర్‌లోకి మార్చి రోజుకో కొత్త రకంగా సప్లయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్వీట్స్, చాక్లెట్స్, హష్ అయిల్‌గా సరఫరా చేసిన కోల్‌కత్తా గంజాయి స్మగ్లర్లు తాజాగా గంజాయి మిల్క్‌షేక్స్‌ను తయారు చేస్తున్నారు. గంజా పౌడర్‌ను పాలు, హార్లిక్స్, బూస్టులో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదంటూ సలహాలిస్తూ యువతను మత్తుకు బానిస చేస్తు్న్నారు. సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు జగద్గిరిగుట్ట ప్రాంతంలో జయశ్రీ కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మనోజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ మిల్క్‌షేక్ రహస్యం బయటపడింది.

కేజీ పౌడర్ రూ.2,500

హైదరాబాద్ సిటీనే టార్గెట్ చేస్తూ స్మగ్లర్లు గంజాయిని పౌడర్‌గా తీసుకొచ్చి చాక్లెట్లుగా, సిగరెట్ ఖాళీ చేసి అందులో నింపి సరఫరా చేస్తున్నారు. ఈ పౌడర్‌ను కేజీకి రూ.2,500కు, పౌడర్‌తో చేసిన చాక్లెట్‌ను ఒకటి రూ.40కి విక్రయిస్తున్నారు. మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులో ఉండొచ్చని యువతను ఆకర్షిస్తున్నారు. ఈ దందా అణచివేతకు నిరంతరం సమాచారం సేకరిస్తూ అడ్డాలను గుర్తించి నిందితులను అరెస్టు చేస్తున్నట్టు పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Just In

01

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే