Dharmapuri Srinivas died
క్రైమ్

Hyderabad:డీఎస్ ఇక లేరు

  • గుండెపోటుతో హైదరాబాద్‌ నివాసంలో కన్నుమూత
  • కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగిన డీఎస్‌
  • పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా బాధ్యతలు
  • బీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక
  • తిరిగి సొంత గూటికి చేరిన డీఎస్‌
  • అనారోగ్యంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరం
  • డీఎస్‌ మరణంపై రాజకీయ ప్రముఖుల సంతాపం
  • ఆదివారం నిజామాబాద్‌లో డీఎస్‌ అంత్యక్రియలు

Senior Congress Leader Dharmapuri Srinivas died son D Aravind declared:
సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌ నివాసంలో డీఎస్‌ పార్థివ దేహాన్ని ఉంచారు. కడసారి చూసేందుకు డీఎస్‌ నివాసానికి కాంగ్రెస్‌ శ్రేణులు అభిమానులు చేరుకుంటున్నారు. శనివారం సాయంత్రం నిజామాబాద్‌ ప్రగతినగర్‌లోని నివాసానికి డీఎస్‌ పార్థీవ దేహం తరలించనున్నారు. ఆదివారం ఉదయం నిజామాబాద్‌లో డీఎస్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపును రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. . అనంతరం మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. . డీఎస్‌కు ఇద్దరు కుమారులు . వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్‌ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు.

ప్రస్థానం

1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీఎస్ హైదరాబాద్ నిజాం కాలేజీ నుండి డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేశారు. తొలిసారి నిజామాబాద్ అర్బన్ నుంచి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1999, 2004 లోనూ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి `1994 వరకూ గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా.. 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. 2004లో తెరాసతో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్‌తో కలిసి పనిచేశారు.

తృటిలో చేజారిన సీఎం పదవి

ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1999, 2004లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డిల క్యాబినెట్‌లలో పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ చీఫ్‌గా,వైయస్ రాజశేఖర్ రెడ్డి జోడీగా కలిసి పనిచేశారు. 2004లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్)తో కాంగ్రెస్ పొత్తులో డీఎస్ క్రీయాశీలక పాత్ర పోషించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన ధర్మపురి శ్రీనివాస్ ఓటమి తధానంతరం హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్ అకాల మరణం సమయంలో ఎమ్మెల్యేగా లేకపోవడంతో సీఎం పదవి ధర్మపురి శ్రీనివాస్‌కు తృటిలో జారిపోయింది. సోనియా గాంధీకి వీర విధేయుడిగా డీఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రణబ్ ముఖర్జీ, తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా డీఎస్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మండలి విపక్ష నేతగా డీఎస్ పనిచేశారు. రెండో సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో డీఎస్ అసంతృప్తికి గురయ్యారు. 2015లో కాంగ్రెస్ రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.

కాంగ్రెస్ సీనియర్లతో సాన్నిత్యం

డీఎస్‌కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు ఉంది. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండో సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది.. 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెరాసలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు తెరాస రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో భారాసతో విభేదించి.. కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.

నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే.. : ధర్మపురి అరవింద్, ఎంపీ

‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాలోనే ఉంటావు’’ అని డీఎస్‌ కుమారుడు అర్వింద్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?