Sangareddy district son-in-law kidnaped father-in-law family clashes police enquiry:
సంగారెడ్డి జిల్లా లో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. కల్హెర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశం అనే వ్యక్తిని అతని సొంత మేనల్లుడే కిడ్నాప్ చేశాడు. నరేందర్ బిచ్కుంద గ్రామానికి చెందిన విద్యుత్ విభాగంలో పనిచేస్తున్నాడు. . 2017 లో కుతూరును మేనల్లుడు నరేందర్ కు ఇచ్చి వెంకటేశం వివాహం జరిపించాడు. కొంతకాలం సవ్యంగానే వీరి కాపురం సాగింది. అయితే భార్యాభర్తల కాపురంలో కలతలు చెలరేగడంతో ఇద్దరూ విడిపోయారు. అయితే తమ కాపురం విడిపోవడానికి తన మామ వెంకటేశం కారణమని మామపై కక్ష కట్టాడు .
కుటుంబ సభ్యుల ఫిర్యాదు
వెంకటేశం హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో అల్లుడు నరేందర్. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కల్హేర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటలు గడిచినా వెంకటేశం ఆచూకీ లభించలేదు. నరేందర్ వెంకటేశంను ఒక కారులో ఎక్కించి మరో కారు మార్చి కిడ్నాప్ కు పాల్పడ్డట్లు ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో సంగారెడ్డి అంతా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అలాగే వెంకటేశం ను కిడ్నాప్ చేసిన నరేందర్ కటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు పోలీసులు.
