fake news
క్రైమ్

Fake Circulars: ఫేక్‌పై కొరడా!

– ప్రభుత్వ నోట్ పేరుతో తప్పుడు ప్రచారం
– ప్రజా ధనం దుర్వినియోగం అంటూ హడావుడి
– పోలీసులకు కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదు
– కేసు నమోదు.. చర్యలకు దిగిన పోలీసులు

Congress Govt: తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌కు బదులు టీజీగా మారిస్తే ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుందని, పేర్ల మార్పునకు రూ.2,767 కోట్లు దుర్వినియోగం అవుతాయంటూ ఓ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని కాంగ్రెస్ శ్రేణులు సీరియస్‌గా తీసుకున్నారు. అది ఫేక్ నోట్ అని, క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రభుత్వ నోట్ అంటూ ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించి వికృత చర్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు చర్యలకు ఉపక్రమించారు. తెలంగాణ ఉద్యమ నినాదమైన ‘టీజీ’ పేరును టీఎస్ బదులుగా అబ్రివేషన్ లెటర్లను మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఏకంగా వేల కోట్లు ఖర్చవుతుందంటూ ఫేక్ నోట్ తయారు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించటం వెనుక కుట్ర ఉందనే అనుమానాలున్నాయి. ఎంపీ ఎన్నికల ఫలితాల్లో సున్నా సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాళ్లే ఈ ఫేక్ నోట్ తయారు చేసి, ఆ పార్టీ అనుబంధ ఎక్స్, వాట్సాప్, యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేశారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ పేరిట ఫేక్ సర్క్యులర్ల సృష్టించి, ఆర్టీసీ కొత్త లోగో అంటూ అసత్యాలను ప్రచారం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే పేర్లు, బోర్డుల మార్పులకు కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఫేక్ నోట్ తయారు చేయటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలని ఫేక్ సర్క్యులర్లు, కుట్రపూరిత పోస్టులు పెట్టే వారిపై కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు హస్తం నేతలు. అధికారం కోల్పోయినా ఓర్వలేని తనంతో కొందరు సోషల్ మీడియాలో ఇలాంటి వికృత, పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. లేని పోని అబద్ధాలు నూరిపోసి, అసత్యాలను ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!