Telangana Phone Tapping Case Files
క్రైమ్

Phone tapping: నేరస్తులంతా చాలా స్మార్ట్.. విచారణ వేగవంతం

– ఫోన్ ట్యాపింగ్ విచారణ వేగవంతం
– ప్రభాకర్ రావుకు త్వరలోనే రెడ్ కార్నర్ నోటీస్
– నేరస్థులంతా పలుకుబడి కలిగినవారు
– ఎవరినీ వదిలిపెట్టమన్న సీపీ

Telangana phone tapping case status(Latest news in telangana)హైదరాబాద్, స్వేచ్ఛ: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన అనుమానితుడు ప్రభాకర్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసు ఇస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్నట్టు ఆయనకు నోటీస్ ఇవ్వలేదని చెప్పారు. శుక్రవారం బషీరాబాగ్ సీపీ కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో నిందితులు చాలా స్మార్ట్, పలుకుబడి కలిగిన వారు కావడంతో దర్యాప్తును పారదర్శకంగా సాగిస్తున్నామని తెలిపారు. కేసు విచారణలో నిందితులకు శిక్షలు పడే విధంగా పూర్తి ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నామని ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఇప్పటికే ఆయనపైన ఎల్ఓసీ జారీ చేసినట్టు చెప్పారు. అది ఇంకా ఫోర్సులోనే ఉందని, ప్రభాకర్ రావు కోసం ఇంటర్ పోల్‌ని ఇంకా సంప్రదించలేదన్నారు. మాజీ గవర్నర్ పేరు మీద కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారని తెలిపారు.

Also Read: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

ఎవరినీ వదిలిపెట్టం

ట్యాపింగ్ జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చే ప్రయత్నం చేస్తున్నామని సమయం వచ్చినప్పుడు రాజకీయ నాయకుల వ్యవహారంపైనా స్పందిస్తామని సీపీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారి స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేశారని ఇది చాలా ఘోరమైన నేరమన్నారు. తమ శక్తి మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కేసులో ఎవరినీ వదిలి పెట్టేది లేదని ఇన్వెస్టిగేషన్‌లో తప్పు చేసిన వారిని గుర్తిస్తే చర్యలు తప్పక ఉంటాయని వెల్లడించారు.

Just In

01

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం