Crime News (imagecredit:swetcha)
క్రైమ్

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: గంజాయి పెడ్లర్​ పై ఎక్సయిజ్​ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ మేరకు హైదరాబాద్(Hyderabad)​ కలెక్టర్​ హరిచందన దాసరి(Collector Harichandana Dasari) ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్ పేటలో నివాసముంటున్న లఖన్​ సింగ్(Lakhan Singh) కొన్నేళ్లుగా గంజాయి దందా చేస్తున్నాడు. ఒడిషా నుంచి 25 కిలోలు మొదలుకుని 100 కేజీల వరకు గంజాయి తెప్పిస్తూ లోకల్ పెడ్లర్లు, మత్తుకు అలవాటు పడ్డవారికి అమ్ముతున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు అరెస్ట్ కూడా అయ్యాడు.

లఖన్​ సింగ్​ పై పీడీ యాక్ట్​

గతంలో పోలీసులు ఒకసారి.. ఎక్సయిజ్ అధికారులు రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రకారం అతన్ని జైలుకు కూడా రిమాండ్​ చేశారు. అయినా, లఖన్​ సింగ్​ తన ప్రవృత్తిని మార్చుకోలేదు. గడిచిన ఎనిమిది నెలల్లో మూడుసార్లు ఒడిషా నుంచి 25, 27, 26 కిలోల గంజాయి తెప్పించి ఎక్సయిజ్​ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ సీఐ అంజి రెడ్డి(CI Anji Reddy)కి పట్టుబడ్డాడు. ఈ క్రమంలో లఖన్​ సింగ్​ పై పీడీ యాక్ట్​ ప్రయోగించాలంటూ ఎక్సయిజ్​ ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టర్​ షానవాజ్​ ఖాసీం హైదరాబాద్ కలెక్టర్​ హరిచందన దాసరికి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో కలెక్టర్​ గంజాయి పెడ్లర్​ లఖన్​ సింగ్​ పై పీడీ యాక్ట్ ఇంపోజ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: Hrithik Roshan: గర్ల్ ఫ్రెండ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన హృతిక్ రోషన్.. ఎందుకంటే?

అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందా

గతకొన్నిరోజుల క్రితం అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ ను హైదరాబాద్​ నార్కొటిక్​ ఎన్​ ఫోర్స్​ మెంట్ అధికారులు అరెస్ట్​ చేశారు. నిందితున్ని స్వదేశానికి పంపించే ప్రక్రియను పూర్తి చేశారు. అయితే డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియా దేశానికి చెందిన అలీ ఎనుకే ఫార్చునటస్ అకుడిన్వా ఎలియాస్ ఫార్చూన్​ (30) తొమ్మిదేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై మన దేశానికి వచ్చాడు. ఆ తరువాత హైదరాబాద్​ చేరుకుని హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని వేర్వేరు పబ్బుల్లో డీజేగా పని చేయటం మొదలు పెట్టాడు. అదే సమయంలో తేలికగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ దందా కూడా ప్రారంభించాడు. కాగా, లంగర్​ హౌస్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫార్చూన్​ ను హైదరాబాద్ నార్కొటిక్​ ఎన్​ ఫోర్స్​ మెంట్ వింగ్ సీఐ బాలస్వామి ఎస్​ఐ మనోజ్​ కుమార్​ తో కలిసి అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్