Palnadu | పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి కోతకు వెళ్లి కూలీలతో తిరిగి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. జిల్లాలోని ముప్పాళ్ల మండలం అడ్డవరం రోడ్డు దగ్గరకు రాగానే 30 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టి కెనాల్ లో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. చాలా మంది ట్రాక్టర్ కింద పడ్డారు. పోలీసులు, స్థానికులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని కూలీలను బయటకు తీస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
