Palnadu bus tipper accident
క్రైమ్

AP accident: ఓట్లేయడానికి వెళ్లి..సజీవదహనం

  • ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ
  • చిలకలూరి పేట మండలం ఈవూరి పాలెంలో
  • ఇద్దరు డ్రైవర్లతో సహా నలుగురు సజీవదహనం
  • పలువురికి తీవ్ర గాయాలు
  • బాపట్ల జిల్లా చినగంజాం నుంచి హైదరాబాద్ కు వెళుతున్న బస్సు
  • మృతులలో ఓట్లేయడానికి సొంత ఊళ్లకు వచ్చిన వాళ్లే
  • మద్యం మత్తే ప్రమాదానికి కారణమంటున్న ప్రయాణికులు

AP palnadu district road accident private bus, tipper lorry clash 6 died spot:
ఏపీ పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరి పేట మండలం ఈవూరి పాలెంలో అరవింద ట్రావెల్స్ ప్రైవేటు బస్సు , టిప్పర్ లారీ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్, టిప్పర్ లారీ డ్రైవర్ తో సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి.. ఆపై వేగంగా బస్సుకు మంటలు వ్యాపించాయి. దీంతో రెండు వాహనాల్లోని డ్రైవర్లతో పాటు మరో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు.

హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా

యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదానికి గురైన బస్సు.. బాపట్ల జిల్లా చినగంజాం నుండి హైదరాబాద్‌ వెళ్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓటు వేయడానికి సొంతూర్లకు వచ్చి.. తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది. మద్యం మత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కళ్లు తెరిచేలోపే..అగ్నికీలలకు బస్సు ఆహూతయిందని ప్రయాణికులు వాపోతున్నారు. గాఢ నిద్రలో ఉన్నవాళ్లు..నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై.. 108తో పాటు పోలీసులకు సమాచారం చేరవేశారు. ప్రమాదానికి గురైన అరవింద ట్రావెల్స్‌ బస్సు మంగళవారం రాత్రి 41 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారే. మృతులను బస్సు డ్రైవర్‌ అంజితో పాటు ఉప్పుగుండూరు కాశీయ్య, ఉప్పుగుండూరు లక్ష్మీ, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీగా గుర్తించారు. మిగిలిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డెడ్ బాడీలను రికవరీ చేశారు. గాయాలైన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తామని ఏపీ పోలీసులు తెలిపారు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు