ORR Accident (imagecredit:AI)
క్రైమ్

ORR Accident: సాయం చేయడానికి వచ్చి మృత్యు ఒడిలోకి.. ఔటర్‌పై కారు బీభత్సం..!

ORR Accident: ఏ సమయంలో మృత్యువు ఎవరికి ఎలా వస్తుందో ఎరికి అర్థంకాదు అని అంటారు పెద్దలు అయితే అలాంటి ఓ సంఘటన జరిగిందిక్కడ, టైర్ మార్చడానికి వెళితే మరో కారు ఢీకొట్టి చంపేసింది. ఔటర్ ఎగ్జిట్ పాయింట్ వద్ద విషాద ఘటన జరిగింది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్గు రొడ్డు పై టయోటో కారు బీభత్సం సృష్టించింది. హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయిన కారు‌ టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను టయోటో‌‌ కారు ఢీ కొట్టింది. దీంతో గాలిలో ఎగిరిపోయిన డ్రైవర్ శివ కేశవ అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదంలో నుజ్జు నుజ్జైన కారు:

ప్రమాదంలో మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి దీంతో భాదితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు వెళుతున్న ఓ కారు హిమాయత్ సాగర్ Exit 17 వద్దకు రాగానే సడన్ గా కారు ఆగిపోయింది. దీంతో వెంటనే కారు డ్రైవర్ ఔటర్ సిబ్బందికి సమాచారం అందించాడు.

స్పాట్ కు చేరుకున్న రికవరీ వ్యాన్ బ్రేక్ డౌన్ అయిన కారు టైరు మారుస్తుండగా మితిమీరిన వేగంతో దూసుకొచ్చి టయోట కారును ఢీ కొట్టింది. కారువేగానికి స్పాట్ లోనే రికవరీ వ్యాన్ డ్రైవర్ శివ‌కేశవ ప్రాణాలు విడిచాడు. ప్రమాదానికిగురి చేసిన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని, నుజ్జునుజ్జు అయిన మూడు కార్లపై‌ కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Karregutta Blast: వరంగల్ లో భారీ పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి.. క్షణ క్షణం ఉత్కంఠ!

 

Just In

01

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?