MLC Kavita backlash in liquor scam
క్రైమ్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలోని వివరాలివే

MLC Kavita: ఎమ్మెల్సీ కవిత ఈ రోజు నాలుగు పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. కోర్టుకు రాసిన ఈ లేఖలో ఆమె కీలక విషయాలను పేర్కొన్నారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని, తాను ఈ కేసులో బాధిరాలినని స్పష్టం చేశారు. ఈ కేసులో చెప్పినట్టుగా తాను ఆర్థికంగా లబ్ది పొందలేదని పేర్కొన్నారు. ఈ కేసు వ్యక్తిగతంగా, రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నదని వాపోయారు.

‘నా మొబైల్ నెంబర్‌ను దర్యాప్తు అధికారులకు ఇచ్చాను. ఆ మొబైల్ నెంబర్‌ను టీవీ చానెల్స్‌లో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్టు నా ఫోన్లను ధ్వంసం చేయలేదు. వాటన్నింటినీ అధికారులకు అందజేశాను. గత రెండున్నరేళ్లుగా ఈ కేసులో భాగంగా అధికారులు పలుమార్లు సోదాలు చేశారు. కానీ, ఏమీ పట్టుకోలేదు. మానసికంగా, భౌతికంగా నన్ను వేదనకు గురి చేశారు. ఎంతో మందిని అరెస్టు చేశారు. రెండున్నరేళ్లుగతా కేసు విచారిస్తున్నారు. రెండు దర్యాప్తు సంస్థల ముందూ విచారణకు హాజరయ్యాను. దర్యాప్తునకు సహకరించాను. నా బ్యాంకు వివరాలు, వ్యాపార వివరాలనూ అందించాను.’ అని కవిత పేర్కొన్నారు.

‘వాంగ్మూలాలు తరుచూ మార్చుతూ వచ్చిన వారి స్టేట్‌మెంట్లు ఆధారం చేసుకుని కేసు నడుపుతున్నారు. నాపై ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారు. కఠిన చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టులో చెప్పిన ఈడీ నన్ను అరెస్టు చేసింది. రెండున్నరేళ్ల విఫల దర్యాప్తు తర్వాత అరెస్టు చేసింది. సాక్షఉలను బెదిరిస్తున్నట్టు నాపై ఆరోపణలు చేస్తున్న ఈడీ.. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని ప్రశ్నించారు.

‘95 శాతం కేసులు అన్నీ ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించినవే. బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ నిలిచిపోతుంది. పార్లమెంటు సాక్షిగా నోరు మూసుకోండి.. లేదంటే ఈడీని పంపుతాం.. అని విపక్ష నేతలపై బీజేపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ వైపే చూస్తున్నాం. మాకు ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నాం. కేసు దర్యాప్తునకు సహకరించడానికి నేను పూర్తి సిద్ధం. నా చిన్న కొడుకు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా తనతో ఉండాలి. నా పాత్రను ఎవరూ భర్తీ చేయలేరు. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. నా బెయిల్ అభ్యర్థనను పున:పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను’ అని ఎమ్మెల్సీ కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు