మెదక్ స్వేచ్ఛ: Medak District News: వింత వ్యాధితో చనిపోయిన కోళ్లను జేసిబితో గుంత తవ్వి ఖననం చేసేది పోయి, గుర్తుతెలియని కోళ్ల ఫామ్ లో దాదాపు, 1500 నుంచి 2000 కోళ్ళు మృత్యువాత పడ్డాయి. అయితే వాటిని మంజీర నది పేరూరు, ఎల్లాపూర్ గ్రామాల మధ్య గల బ్రిడ్జి సమీపంలో నీళ్లలో పార పోశారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మంజీర నది సమీప ప్రాంతాల గ్రామాలకు సహితం మంచినీటి సరఫరా మంజీరా నదిలో ఉన్న ఫిల్టర్ బెడ్ ల నుండే తాగునీటి సరఫరా జరుగుతున్నాయి.
అంతేకాకుండా కొద్ది దూరంలోనే మెదక్ పట్టణానికి సరఫరా చేసే ఫిల్టర్ బెడ్ బావులు ఉన్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంజీర తీరాన ఇరువైపులా ఎల్లాపూర్ పేరూరు ర్యాలమడుగు, గడ్మన్ పల్లి, గాంధర్ పల్లి, తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కలుషితమైన నీటిని, పశువులు, తాగితే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలే వింత వ్యాధితో చనిపోయినా కోళ్ల కళేబరాలు, మంజీర నది నీళ్ళల్లో లియాడుతున్నాయి.
సమీప గ్రామాలలో ఫోల్ట్రీ ఫాం నిర్వహిస్తున్న వారికి సంబంధించిన కోళ్ళు మృత్యువాత పడగా మంజీర నది లో పార పోసినట్లు అనుమానిస్తున్నారు. ట్రాక్టర్ కు సంబంధించి, నది వద్ద ఆనవాళ్లు ఉన్నట్లు పేరూరు గ్రామస్తులు పేర్కొంటున్నారు. రహదారిపై సీసీ కెమెరాలు, చెక్ చేస్తే వారు దొరికే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ లు దర్యాప్తు చేస్తే ఫోల్త్రి ఫాం యజమానులు పట్టుబడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Betting Apps: ఆధారాలు సేకరిస్తున్నాం, ఎవ్వరినీ వదిలి పెట్టం.. ఇన్‌ఫ్లూయెన్సర్ల గుండెల్లో వణుకు!
ఇదిలా వుండగా డీపీఓ, మున్సిపల్ అధికారులు కల్పించుకొని కోళ్లను నది నుండి తీసి వేయించాలని, ఎల్లాపూర్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి,పేరూరు మాజీ సర్పంచ్ శంకర్, అయాగ్రామల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోగంతో చనిపోయినా కోళ్ల ను మంజీరలో పార పోసిన వారిని పట్టుకొని కేసులు నమోదు చేయాలని అగ్రామ మాజీ సర్పంచ్ కే. శంకర్ డిమాండ్ చేశారు.