భోజనానికి పిలిచి.. ఒక్క బాటిల్ మందుతో ముగ్గురిని చంపేశాడు
Murder
క్రైమ్, నార్త్ తెలంగాణ

భోజనానికి పిలిచి.. ఒక్క బాటిల్ మందుతో ముగ్గురిని చంపేశాడు

తిరుమలాయపాలెం, స్వేచ్ఛ : మద్యంలో విషం కలిపి వ్యక్తి హత్యకు పాల్పడిన నిందితుడికి జీవితఖైదు ఖైదు విధిస్తూ ఎస్సీ, ఎస్టీ జిల్లా అదనపు న్యాయమూర్తి డీ రాంప్రసాదరావు తీర్పునిచ్చారు. ఏసీపీ, సీఐ. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రు తండాకు చెందిన బోడ హరిదాసు, బోడ మల్సుర్, బోడ భద్రును అదే గ్రామానికి చెందిన బోడ చిన్న పెద్దకర్మ భోజనానికి పిలిచి.. ఐబీ మద్యం బాటిల్లో విషం కలిపి తాగించాడు.

దీంతో ముగ్గురు మృతి చెందగా.. వారి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 30 మంది సాక్షులను విచారించి.. కోర్టులో హాజరు పరిచారు. బాధితుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీ కృష్ణమోహన్ రావు వాదనలు వినిపించారు. పూర్వాపరాలు పరిశీలించిన ఎస్సీ, ఎస్టీ జిల్లా అదనపు న్యాయమూర్తి డీ రాంప్రసాదరావు నిందితుడు బోడ చిన్నాకు జీవిత ఖైదు, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు. కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన సీఐ సతీశ్, ఎస్ఐ రఘు, కోర్టు కానిస్టేబుల్ ఎల్ భద్రాజి, హోంగార్డు బీ వెంకన్న, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!