Crime News: తెలంగాణలోని గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు చివరకు ఇద్దరి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లాయి. భార్యతో జరుగుతున్న గొడవలు, కుటుంబ సమస్యలు తాళలేక భర్త అతి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.
గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య సంధ్య (42) ను తాడుతో ఉరేసి చంపిన అనంతరం, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, భార్యతో పాటు ఆమె కూతురు నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని భావించిన రామాచారి, మానసిక ఒత్తిడికి గురయ్యాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Madhusudhan Reddy: సీఎం రేవంత్ హయాంలో సర్కారు కాలేజీలకు మహర్దశ : జీజేఎల్ఏ నేత మధుసూధన్ రెడ్డి!
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, భార్యను చంపిన తర్వాత రామాచారి ఒక వీడియో రికార్డ్ చేసి, దానిని స్టేటస్‌గా పెట్టుకున్నాడని సమాచారం. ఆ వీడియోలో తన బాధ, కుటుంబ సమస్యల గురించి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
రామాచారికి ఇది రెండో వివాహం. అతని మొదటి భార్య గతంలో మృతి చెందగా, తర్వాత సంధ్యను వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇంట్లో పరిస్థితులు బాగోలేవని స్థానికులు చెబుతున్నారు.
Pawan Kalyan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు సాయం
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి, అసలు కారణాలేంటి? ఎవరి పాత్ర ఎంత వరకు ఉంది? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో సీతారాంపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

