మహబూబాబాద్ స్వేచ్ఛ: Ganja Seized: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజ్ చేసిన రూ. ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల విలువైన 513 కేజీ 176 గ్రాముల గంజాయిని మహబూబాబాద్ జిల్లా పోలీసులు ధ్వంసం చేసినట్లు సుధీర్ రామ్నాథ్ కేకన్ వెల్లడించారు. శుక్రవారం కాకతీయ మెడిక్లీన్ ఏజెన్సీ, ఊర్సుగుట్ట, హన్మకొండలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, మాధకాద్రవ్యాల నిరోధక శాఖ ఆదేశాలమేరకు డ్రగ్ డిస్పోసల్ కమిటీ సభ్యుల సమక్షంలో గంజాయి దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ గండ్రతి మోహన్, టౌన్ డిఎస్పీ తిరుపతి రావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, గూడూరు సీఐ సూర్య ప్రకాష్, మహబూబాబాద్ టౌన్ సీఐ దేవేందర్, మరిపెడ సీఐ రాజకుమార్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, యువతను డ్రగ్స్ మాయలోకి దూరనీయకుండా అవగాహన కార్యక్రమాలు, కఠినమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఎవరైనా మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం గురించి సమాచారం అందిస్తే ఆ వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read: Proddatur News : ప్రేమ పేరుతో బరితెగించిన విద్యార్థి.. 32 ఫేక్ ఐడీలతో వేదింపులు