ఏటూర్ నాగారం/మహబూబాబాద్ స్వేచ్ఛ: Mahabubabad Murder: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యువకుడిని అత్యంత దారుణంగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్(28)ను గుర్తు తెలియని దుండగులు తలపై గొడ్డలితో అతి దారుణంగా, అత్యంత పాశవికంగా గొడ్డలితో దాడి చేసి హతమర్చారు.
ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న వెంకటాపురం సిఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తదనంతరం కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో టేకులగూడెం గ్రామంలో అలజడి మొదలైంది.
ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య పైన పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు ఈ హత్య ఎందుకు చేశారు కుటుంబ కలహాలా ఆస్తి తగాదాల వివాహేతర సంబంధాల అనే పలు విధాల కోణాల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.
Also Read: Mujra Party: ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. తర్వాత ఏమైందంటే?