Mahabubabad Crime: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే అప్పు అడగడంతోనా లేదంటే ల్యాండ్ ఇష్యూతోనా? అదే గ్రామానికి చెందిన కొంతమంది అప్పు తీసుకున్న వ్యక్తులు హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే గూడూరు మండలం గుండెగ గ్రామానికి చెందిన తేజవత్ భద్రు గత సోమవారం రాత్రి ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడని భార్య తేజవత్ నీల మంగళవారం గూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కాగా, కేసు నమోదు చేసుకున్న గూడూరు పోలీసులు భద్రు మిస్సింగ్ కేసులో విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే అదే గుండెంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గూడూరు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా సమాచారం ద్వారా తెలుస్తోంది. నిందితుడిచ్చిన సమాచారం మేరకు తేజవత్ భద్రును హత్య చేసిన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు.
Also Read: Delhi High Court: భార్యను బలవంతం చేయడం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు!
చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ పరిధి ఓ వ్యవసాయ బావి వద్ద మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గుండెంగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బందోబస్తు నిమిత్తం పోలీసులు భారీగా మోహరించారు. భద్రు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.