Mahabubabad (imagecredit:swetcha)
క్రైమ్

Mahabubabad: తొర్రూరులో దారుణం.. వైద్యం వికటించి 4 నెలల పసికందు మృతి..

పాలకుర్తి స్వేఛ్ఛ: Mahabubabad: వైద్యం వికటించడంతో నాలుగు నెలల శిశువు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లోని రోహిత్ పిల్లలు హాస్పిటల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లికి చెందిన మహంకాళి రజిత రామకృష్ణ దంపతుల రెండవ కుమారుడు మహంకాళి అభిమన్యు ఉదయం జ్వరం రావడంతో రోహిత్ పిల్లల హాస్పిటల్ కి చికిత్స కోసం వచ్చి వైద్యున్ని సంప్రదించగా డాక్టర్ ఇంజక్షన్ వేయడంతో వైద్యం వికటించి బాలుడు మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యమే శిశువు మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు అతన్ని రోహిత్ పిల్లల హాస్పిటల్‌కు తీసుకొచ్చామని, అయితే అక్కడ జరిగిన వైద్య వైఫల్యం కారణంగా బాలుడు మరణించాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిశువు మృతితో తోర్రుర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి

రోహిత్ పిల్లలు హాస్పిటల్‌లో వైద్యం వికటించడంతో ఓ నిండు ప్రాణం మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.గతంలోనూ ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ, అధికారుల చర్యలు శూన్యంగానే మిగిలిపోయాయి. కొన్ని నెలల క్రితం బాలాజీ నర్సింగ్ హోమ్‌లో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయినా, సంబంధిత అధికారుల మాత్రం నామమాత్రపు తనిఖీలు చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాసులకు కక్కుర్తిపడ్డారని స్థానికుల ఆరోపణలు చేశారు.

ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటే, ప్రజల ప్రాణాలకు రక్షణ ఎక్కడ, ప్రైవేట్ హాస్పిటల్స్‌పై ఎప్పటికైనా నియంత్రణ విధిస్తారా, లేక ప్రాణ నష్టాన్ని తట్టుకోవడం ప్రజల వంతేనా అధికారుల నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే అని అన్నారు.

Also Read: Suryapet: వామ్మో..మహిళ కడుపులో అంత పెద్ద కణితి.. తొలగించిన వైద్యులు

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?