Love Breakup Young Army Man Commits Suicide In Vikarabad District
క్రైమ్

Suicide: లవ్‌ ఫెయిల్‌, ఆర్మీ జవాన్‌ సూసైడ్‌

Love Breakup Young Army Man Commits Suicide In Vikarabad District: వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దోమ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుంట చింటూ అనే ఆర్మీ జవాన్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడంతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన వ్యవసాయ భూమిలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు.

2023 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో సెలక్ట్‌ అయి, బెంగళూరులో శిక్షణ పూర్తి చేసిన మృతుడు చింటు నెలరోజులకి గుజరాత్‌ రాష్ట్రంలో ఉద్యోగంలో జాయిన్ కావలసి ఉండగా, సెలవుపై తన స్వగ్రామానికి వచ్చిన జవాన్ తాను ప్రేమించిన అమ్మాయిని కలిశాడు. ఈ క్రమంలో ఆ యువతి తన ప్రేమని ఒప్పుకోకపోవడంతో మనస్థాపానికి గురైన చింటు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో చేతికి అంది వచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Also Read:మైనర్ బాలికపై అత్యాచారం

భారత సైన్యంలో చేరి మంచిగా పనిచేసి కుటుంబానికి ఆసరా నిలుస్తాడనుకుంటే ఆత్మహత్యకు పాల్పడడం అందరిని కలచివేసింది. చింటు మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా సమాచారం అందుకున్న దోమ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ఏరియా దవాఖానకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం చింటూ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?