lorry drags bike in hyderabad
క్రైమ్

Old City: బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ.. రెండు కిలోమీటర్లు బ్యానెట్ పట్టుకుని వేలాడిన రైడర్

Accident: హైదరాబాద్‌లో ఓ లారీ డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంతో, ఇష్టారీతిన వాహనాన్ని నడిపాడు. ఎదురుగా ఉన్న బైక్‌ను ఢీకొట్టాడు. అదేమని ప్రశ్నించగా బైక్‌ను అలాగే ఢీకొట్టి సుమారు రెండున్నర కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఆ బైక్ రైడర్ తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లడానికి సిద్ధం అవుతుండగా రైడర్ ఆ లారీ బ్యానెట్ పట్టుకున్నాడు. లారీని ఆపాలని వేడుకున్నా ఆ లారీ డ్రైవర్ కనికరించలేడు. సరికదా లారీ వేగాన్ని మరింత పెంచాడు. బైక్‌ను ఈడ్చుకెళ్లుతుంటే లారీ కింద నిప్పులు చిమ్ముతున్న దృశ్యాలతో ఓ వీడియో వైరల్ అయింది. ఈ ఘటన పాతబస్తీ ప్రాంతంలో జరిగింది.

చంపాపేట ప్రధాన రోడ్డుపై హోండా ట్విస్టర్ బైక్ పై స్థానిక వ్యాపారి మహ్మద్ అబ్దుల్ మజీద్ వెళ్లుతున్నాడు. అప్పుడే వెనుక నుంచి ఓ లారీ వచ్చింది బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మజీద్ రోడ్డుకు ఎడమ వైపున పడిపోయాడు. ఆ తర్వాత బైక్‌ను లారీ అలాగే ఈడ్చుకెళ్లుతుండగా వెంటనే ఆయన లారీ బ్యానెట్‌పైకి ఎక్కి లారీ ఆపాలని కోరాడు. కానీ, ఆ లారీ డ్రైవర్ మరింత వేగం పెంచాడు. సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర బైక్‌ను అలాగే ఈడ్చుకెళ్లాడు. మజీద్ ఆ లారీ బ్యానెట్‌ను భద్రంగా పట్టుకున్నాడు. బైక్ మాత్రం పనికిరాకుండా నుజ్జునజ్జయింది.

కొద్ది దూరం వెళ్లాక ఓ వాహనం అడ్డు రావడంతో లారీని ఆపాడు. బాధితుడు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ లారీని సీజ్ చేశారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు. చంపాపేట్‌లోనే ఆ లారీ మరో కారును ఢీకొన్నట్టు తెలిసింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!