gold crime (imagecredit:AI)
క్రైమ్

gold crime: తోర్రూరులో దొంగల హల్ చల్.. భయాందోళనలో ప్రజలు..

పాలకుర్తి స్వేచ్ఛ: gold crime: వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తొర్రూరు పట్టణంలో ఇళ్లలో చోరీలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం పట్టణానికి చెందిన భూక్యా సునీత, గుగులోతు కొమురమ్మ, అనే మహిళలను కూలి పనిచేయాలని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లినా దుండగులు, మహబూబాబాద్ రోడ్డులో పిల్లి గుండ్ల తండ ఎదురుగా బైక్ ఆపి వేరే అతని అక్కడికి పిలుచుకొని ఆమె వద్ద ఉన్న రెండు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సుమారు దాని విలువ 2 లక్షల పై చిలుకు ఉంటుందన్నారు. భూక్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తోరూర్ ఎస్సై జి. ఉపేందర్ తెలిపారు.

కొద్ది గంటల వ్యవధిలో మరొక ఇంట్లో దొంగతనం

ఉదయం జరిగిన దోపిడీ మరువక ముందే మధ్యాహ్నం మరో ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు మూల కరుణ ఇంట్లోకి చొరబడి డబ్బులు, తులం నారా బంగారం,20 తులల వెండి అపహరించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించదాంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనలో సుమారు మూడు లక్షల రూపాయల విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు వెల్లడించారు. మూలా కరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తొర్రూరు ఎస్ఐ జీ. ఉపేందర్ తెలిపారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!