క్రైమ్

Kodada : ఆగివున్న లారీని ఢీకొన్న కారు ఆరుగురు మృతి

  • కోదాడ పరిధిలోని శ్రీరంగాపురం జాతీయ రహదారి వద్ద ఘటన
  • ప్రమాదాలకు కారణమవుతున్న నిలిపివున్న లారీలు
  • కొరవడిన అధికారుల పర్యవేక్షణ
  • ప్రధాన రహదారుల్లో రోజుల తరబడి నిలిపివేస్తున్న లారీలు
  • రాత్రి సమయంలో గుర్తించలేకపోతున్న వాహనదారులు
  • ఇటీవల జరిగిన ముకుందాపురం యాక్సిడెంట్ కు కారణం ఇదే
  • ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్న వాహనదారులు

 

Lorry-Car accident Kodad : లారీలను నడిపే డ్రైవర్ల వేగానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. జాతీయ రహదారిపై పోలీస్‌, రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. మద్యం తాగి.. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడపడం.. నిబంధనలు పాటించకపోవడం ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. ప్రమాద సమయాల్లోనే కాకుండా నిరంతరం డ్రైవర్లకు కౌన్సెలింగ్‌, మద్యం తాగి నడపకుండా శ్వాస పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారిపై ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి లారీల దూకుడుకు కళ్లెం వేయాలని వాహనదారులు కోరుతున్నారు. కోదాడ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇందుకు కారణం జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొనడమే..వివరాలలోకి వెళితే..

శ్రీరంగ పురం వద్ద

ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన సంఘటనలో ఆరుగురు మృతి చెందిన ఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపునకు వెళ్తున్న కారు శ్రీరంగాపురం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళుతున్న కారు ముకుందాపురం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు నవ దంపతులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదాలకు కారణమవుతున్న లారీలను జాతీయ రహదారి వెంట ఆపవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ లారీ యజమానులు డ్రైవర్లు అవేమీ పట్టించుకోకుండా దర్జాగా రహదారి పక్కన ఆపి పలువురు ప్రాణాలను బలి కొంటున్నారు. రూట్‌మ్యాప్‌ లేకుండా లారీలకు అనుమతించడం, వచ్చి న వాహనాలను వెంట వెంటనే లోడ్‌ చేయకపోవడం, ప్రధాన రహదారిపై రోజుల తరబడి నిలిపి ఉంచడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!