Kerala kidney linked hyd
క్రైమ్

Kerala Kidney rocket: హైదరాబాద్ టూ కొచ్చి..వయా ఇరాన్

  • కేరళలో వెలుగు చూసిన మరో కిడ్నీ రాకెట్
  • హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న అక్రమ కేంద్రం
  • నగరానికి చెందిన ఓ డాక్టర్ ప్రమేయం పై అనుమానం
  • వందల సంఖ్యలో యువకులను ఇరాక్ తీసుకెళ్లి ఆపరేషన్లు
  • కొచ్చిలో తెలుగు యువకుడు సబిత్ ఇచ్చిన సమాచారం

Kerala state kidney rocket key role play Hyderabad doctor:

పేద యువకులను టార్గెట్ చేసుకుని కేరళలో కిడ్నాప్ రాకెట్ నడుస్తోంది. అయితే కేరళలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్‌ ఉదంతం వెనుక నగర మూలాలు ఉండడం కలకలం రేపుతోంది. కీలక సూత్రధారులు ఇక్కడివాళ్లే అని.. ఓ ప్రముఖ డాక్టర్‌ సూత్రధారిగా కేరళ పోలీసులు నిర్ధారించుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వయా కొచ్చి టూ ఇరాన్‌ కేంద్రంగా నడిచిన ఈ కిడ్నీ రాకెట్‌ వివరాల్లోకి వెళ్తే.. కేరళలో తాజాగా ఓ యువకుడు మృతి చెందాడు. అయితే కిడ్నీ దానం పేరిట మోసం జరిగిందని, ఒక ముఠా తమ కొడుకును బలిగొందని అతని కుటుంబ సభ్యులకు కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన కొచ్చి పోలీసులు సబిత్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సబిత్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టును చేధించారు.

పేద యువకులే టార్గెట్

పేద యువకులను ఓ ముఠా లక్ష్యంగా చేసుకుని ఈ కిడ్నీ రాకెట్‌ నడిపిస్తోంది. ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షలు ఇస్తామని ఆశజూపి.. ఇరాన్‌కు తీసుకెళ్తోంది. అక్కడ కిడ్నీలు తీసుకుని.. తిరిగి ఇండియాకు తీసుకొస్తోంది. తీరా ఇక్కడికి వచ్చాక కేవలం రూ. 6 లక్షలే ఇవ్వడంతో బాధితులు కంగుతింటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు చనిపోవడంతో ఈ ముఠా అరాచకాలు వెలుగు చూశాయి.

హైదరాబాద్‌ నుంచే..

ఈ కిడ్నీ రాకెట్‌ కీలక సూత్రధారులు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులుగా కేరళ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 40 మందికిపైగా యువకుల నుంచి కిడ్నీలు ఈ ముఠా సేకరించినట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు నగరానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా గుర్తించిన కేరళ పోలీసులు.. ఆ వైద్యుడితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తుల కోసం వెతుకుతున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!