Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage issue:
హైదరాబాద్ లో అతను ఓ ప్రముఖ బిల్డర్. ట్రావెల్స్ వ్యాపారమూ ఉంది వ్యాపారం పనినిమిత్తం నిత్యం బయట తిరుగుతున్న అతని వెంట స్నేహితులు ఉన్నారు. వ్యాపారం పనిమీద పొరుగు రాష్ట్రానికి వెళ్లాడు. బిల్డర్ కు తోడుగా అతని స్నేహితులు వెళ్లారు. భార్యకు ఫోన్ చేసిన వ్యక్తి తాను హైదరాబాద్ బయలుదేరాను అని చెప్పాడు. తరువాత ఆ బిల్డర్ తల మీద బండరాళ్లు వేసి, కత్తులతో పొడిచి అతన్ని అతి కిరాతంగా హత్య చెయ్యడం రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది. కాగా మధు హత్య ఘటన వెనుక ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బిల్డర్ మధుకు రూ.200 కోట్ల ఆస్తి ఉంది. మధు.. చీకోటి రామ్ అనుచరుడు. అయితే మధును చంపింది ఆయన స్నేహితులే. వీరంతా జీడిమెట్ల కల్పన సొసైటీలో ఉండేవారు. చీకోటి రామ్ తో కలిపి రేణుకా ప్రసాద్, లిఖిత్ సిద్ధార్థ్‌రెడ్డి వరుణ్‌తో మధుకు స్నేహం కుదిరింది. క్యాసినో ఆటలో మధుకు, రేణుకా ప్రసాద్ గ్యాంగ్‌తో స్నేహం పెరిగింది. మధును క్యాసినో ఆడుదామని చెప్పిన స్నేహితులు దారుణ హత్య చేశారు. దీని వెనక బలమైన కారణమే ఉందంటున్నారు స్థానికులు. మధుకు ఇద్దరు ఆడపిల్లలు న్నారు. మధుకు నవరాత్రులు ఘనంగా నిర్వహించే అలవాటు ఉండేది. గతేడాది నవరాత్రుల టైమ్ లో పూజలో మధు చిన్న కూతురు కూడా పాల్గొంది. అప్పటినుంచి మధు చిన్నకూతురిపై స్నేహితుడు రేణుకా ప్రసాద్ కన్నేశాడు. మధు లేనప్పుడు తరచుగా ఇంటికి వస్తూ చిన్న కూతురికి మాయమాటలు చెబుతూ ఆమెను ప్రేమలో దించాడు.
పెళ్లికి ఒప్పుకోలేదని..
మధుని తన కూతురినిచ్చి తనతో పెళ్లిచేయవలసిందిగా రేణుకా ప్రసాద్ కోరాడు. వాళ్ల పెళ్లికి మధు ససేమిరా ఒప్పుకోలేదు. పైగా చిన్న కూతురికి వేరే సంబంధం కుదిర్చాడు మధు. తన ప్రేమను కాదని కూతురికి వేరే పెళ్లి చేయాలని అనుకున్న మధుపై కక్ష పెంచుకున్నాడు రేణుకా ప్రసాద్. అందుకే స్నేహితులతో కలిసి మధును చంపేందుకు స్కెచ్ వేశాడు. అయితే ముందుగా హైదరాబాద్ లోనే హత్య చేద్దామని ప్రణాళికలు వేశారు. అందుకోసం సుపారీ గ్యాంగ్ తో బేరం కుదుర్చుకున్నాడు. నెల్లాళ్లుగా సుపారీ గ్యాంగ్ మధు హత్య కోసం వేచివున్నారు. అయితే హైదరాబాద్ లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో వేరే ప్రాంతానికి తీసుకెళ్లి చంపుదామని భావించారు. ఎప్పటిలానే క్యాసినో ఆడుదామని స్నేహితులు మధును ఒప్పించి బీదర్ కు తీసుకెళ్లారు. అక్కడ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బండరాయితో దారుణంగా హత్య చేశారు. మధు తలపై పెద్దబండరాయితో దాడి చేసిన తరువాత అతన్ని కత్తులతో పొడిచి చంపేశారని మన్నేకెళ్లి పోలీసులు తెలిపారు. బిల్డర్ ను హత్య చేసిన నిందితులు అతని శరీరం మీద ఉన్న రూ. 6 లక్షల విలువైన బంగారు నగలు, వ్యాపారం నిమిత్తం వెంట తీసుకెళ్లిన భారీ మొత్తంలోని నగదు ఎత్తుకెళ్లారని అతని భార్య వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధు వెంటవెళ్లిన రేణుక ప్రసాద్, లిఖిత్ సిద్దార్థ్ రెడ్డి, వరుణ్ అనే ముగ్గురే హత్య చేసి ఉంటారని, వారి కోసం గాలిస్తున్నామని మన్నేకెళ్లి పోలీసులు, హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.