క్రైమ్

Hyderabad : ‘ట్యాపింగ్ ’నిందితులు చాలా స్మార్ట్

  • మీడియా సమావేశంలో పీసీ శ్రీనివాసరెడ్డి
  • ఫోన్ టాపింగ్ విచారణ వేగినవంతం చేశాం
  • ప్రభాకర్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసు
  • ఇప్పటికే ప్రభాకర్ రావు పైన ఎల్ ఓ సి జారీ చేశాం
  • నేరస్థులంతా పలుకుబడి కలిగిన వారు
  • ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు
  • వ్యక్తిగత జీవితాల్లో చొరబడటం ఘోరం
  • సమయం వచ్చినప్పుడు రాజకీయ నాయకులపై స్పందిస్తాం

Police Commissioner Srinivasa Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన అనుమానితుడు ప్రభాకర్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసు ఇస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు మాత్రం రెడ్ కార్నర్ నోటీసు ఎవరికీ ఇవ్వలేదని అయన చెప్పారు. శుక్రవారం బషీరాబాగ్ సీపీ కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు చాలా స్మార్ట్, పలుకుబడి కలిగిన వారు కావడం దర్యాప్తును పారదర్శకంగా సాగిస్తున్నామని సీపీ తెలిపారు. కేసు విచారణలో నిందితులకు శిక్షలు పడే విధంగా పూర్తి ఆధారాలు సేకరిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. ప్రభాకర్ రావు కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నామని ప్రస్తుతానికి ప్రభాకరరావు అమెరికాలో ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పైన ఎల్ ఓ సి జారీ చేయడం జరిగింది . అది ఇంకా ఫోర్సులోనే ఉంది ..ప్రభాకర్ రావు కోసం ఇంటర్ పోల్ ని ఇంకా సంప్రదించలేదన్నారు. మాజీ గవర్నర్ పేర్ల మీద కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు.

ఎవరినీ వదిలిపెట్టం

ట్యాపింగ్ జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చే ప్రయత్నం చేస్తున్నామని సమయం వచ్చినప్పుడు రాజకీయ నాయకుల వ్యవహారం పైనా స్పందిస్తామని పీసీ శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారి స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేశారని ఇది చాలా ఘోరమైన నేరమన్నారు. మా శక్తి మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసు లో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఇన్వెస్టిగేషన్‌లో తప్పు చేసిన వారిని గుర్తిస్తే వారి చర్యలు తప్పక ఉంటాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు