Hyderabad:రెండుగా చీలిన జూడాలు
Gandhi, osmania junior doctors
క్రైమ్

Hyderabad: రెండుగా చీలిన జూడాలు

– తాత్కాలికంగా సమ్మె విరమణ
– తాము కొనసాగిస్తామంటున్న ఉస్మానియా జూడాలు
– వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు
– ఉస్మానియా నూతన బిల్డింగ్‌పై నో క్లారిటీ

Hyderabad junior doctors divided into two groups on strike: తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్యశాఖ అధికారులతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సమ్మెకు విరామం ప్రకటించారు. అయితే, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవన ఏర్పాటుపై మాత్రం ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అక్కడ సమ్మె కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

సమ్మె కొనసాగిస్తాం

ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ పైన క్లారిటీ రానిదే సమ్మెను ఎలా విరమిస్తాం అని గాంధీ ఆస్పత్రి జూడాలును ఉస్మానియా జూడాలు ప్రశ్నించారు. అందుకే, తాము సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మొత్తం 8 డిమాండ్స్‌లో కేవలం 2 అంశాలు పరిష్కారం అయితే సరిపోతుందా వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమ మధ్య చీలిక తెచ్చిందని ఉస్మానియా జూడాలు వాపోయారు.

ప్రభుత్వ హామీలు

చర్చల్లో భాగంగా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో వసతి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వసతి భవనాలకు నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధుల మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చింది.

తాత్కాలికంగా విరమణ

ప్రభుత్వ హామీ నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా నిపివేస్తున్నట్లు జూడాలు తెలిపారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాల్లోని జూడాలతో చర్చలు జరిపారు. గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ప్రతినెలా స్టైపెండ్‌ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్లు ఇటీవల సమ్మెకు దిగారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..