- హైదరాబాద్ నేరేడుమెట్ లో దారుణం..
- మైనర్ బాలికపై ఐదుగురు యువకుల గ్యాంగ్ రేప్.
- మైనర్ బాలికకు గంజాయి అలవాటు చేసిన యువకులు.
- గంజాయి మత్తులోకి దిగానే అత్యాచారం చేసిన యువకులు.
- జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించిన మైనర్ బాలిక
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
Hyderabad Gang rape on Minor girl at Neredmet by giving drugs:
చిన్నాపెద్ద తేగా లేకుండా దేశంలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకో ఘోరం వెలుగు చూస్తున్నా నేరానికి పాల్పడుతున్న వారిలో మార్పు రావడం లేదు. పసిపిల్లలు మొదలుకుని అన్ని వయసుల వారిపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ నేరేడుమెట్‌లో గ్యాంగ్ రేప్ తీవ్ర సంచలనం సృష్టించింది.
బాలికను ట్రాప్ చేసి
కాచిగూడ కు చెందిన బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ట్రాప్ చేసి యువకులు నేరేడుమెట్ తీసుకెళ్లారు. బాలికకు గంజాయి తాగించి యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం విషయాన్ని తల్లికి బాధితురాలు కొంతకాలం దాచిపెట్టింది. అయితే అకస్మాత్తుగా బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గుర్తించిన తల్లి నిలదీయగా అసలు విషయం చెప్పింది. కాచిగూడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. నేరేడుమెట్ పీఎస్‌కు కేసును పోలీసులు బదిలీ చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.