Hyderabad bike racers
క్రైమ్

Hyderabad:భయపెడుతున్న బైక్ రేసర్లు

  • హైటెక్ ప్రాంతంలో అర్థరాత్రి బైక్ రేసింగ్లు
  • ఆకతాయి యువకుల బైక్ విన్యాసాలు
  • బెదిరిపోతున్న వాహనదారులు
  • స్పెషల్ డ్రైవ్ చేపట్టిన రాయదుర్గం పోలీసులు
  • పోలీసుల అదుపులో 50 బైకులు
  • యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు

Bike racers: రోడ్డు పై వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అంతా రోడ్డున పడాల్సి వస్తుందన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ హైదరాబాద్ నగరంలో కొందరు యువకులు సాహసాలకు పాల్పడుతున్నారు. బైక్ రేసింగ్ కల్చర్ తో రోడ్లపై రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి,అపరాత్రి అనే తేడా లేకుండా రాత్రుళ్లు బైక్ పై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. తెల్లవారుజాము వరకు రేసింగ్ లకు పాల్పడుతూ వీరంగం సృష్టిస్తు్న్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అతి వేగంగా రోడ్లపై 100 నుంచి 150 వాహనాలతో రేస్ లకు పాల్పడి స్టంట్ లు చేస్తూ రోడ్లపై ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. వీకెండ్ సమయంలో కొందరు యువకులు బైక్ లపై స్టెంట్లు వేస్తూ అర్ధరాత్రి హల్చల్ చేస్తున్నారు.. దీనితో బైక్ రేసర్లపై రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శనివారం అర్థరాత్రి టీ హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్, మైహోం భుజా ఏరియా లలో బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి చెందిన 50 బైకులను రాయదుర్గం పోలీసులు సీజ్ చేశారు. బైక్ రేసింగ్ చేసి పట్టుబడ్డ యువకులకు కౌన్సిలింగ్ చేశారు.

సోషల్ మీడియా హీరోలయ్యేందుకు

కొంతమంది యువకులు తెల్లవారుజామున రేసింగ్‌లు చేస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అత్యంత వేగంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని లైక్ ల కోసం యువత తమ బాధ్యతగా మైన జీవితాన్ని పనంగా పెట్టి విన్యాసాలు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. యువకులు 100 నుండి 150 కి.మీ వేగంతో అత్యంత వేగంగా రోడ్లపై స్పీడ్ పెంచి సైటెన్సర్ తో విపరీతమైన సౌండ్ లు చేస్తూ వాహనదారులకు, ప్రజలకు భయాందోళనకు గురిచేస్తున్నారు. బైక్ నడుపుతున్న వారందరూ మైనర్లు ఉండటం గమనార్హం. బైక్ నడుపుతున్నవారికి 18 ఏళ్లు కూడా నిండినట్లు లేదని, వారంతా మైనర్ బాలురు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వారందరూ బైక్ ను 150 స్పీడ్ తో నడుపుతూ వాహనదారులకు భయభ్రాంతులకు గురి చేస్తుంన్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి విన్నపాలకు స్పందించిన నగర పోలీసులు ఎట్టకేలకు రంగంలో దిగి యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాదు వారి బైకులను సీజ్ చేశారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు