Crime News (imagecredit:swetcha)
క్రైమ్

Crime News: చైన్ స్నాచింగ్ ఎలా చేయాలి అని యూట్యూబ్‌‌లో ట్రైనింగ్.. కానీ సీన్ రివర్స్..?

Crime News: చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన సంఘటనా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghat Kesar Police Station) పరిధిలో జరిగింది. ఘట్ కేసర్ ఇన్స్పెక్టర్ బాలస్వామి(Balaswamy) తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 9న అంకుషాపూర్ లో అర్ధ కాంతమ్మ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలో నుంచి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి ఏసిపి చక్రపాణి(ACP Chakrapani) ఆధ్వర్యంలో ఇన్సెక్టర్ బాలస్వామి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, క్రైమ్ టీం బృందాలుగా ఏర్పడి 48 గంటలోనే దొంగలను పట్టుకున్నామని తెలిపారు. ఈనెల 12న ఘనపూర్ సమీపంలో మళ్లీ దొంగతనానికి వచ్చిన నిందితులను సర్వీస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

Also Read: Farmers Protest: వరంగల్ జిల్లాలో.. యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. రహదారి పై రాస్తారోకో

ఈజీ మనీ కోసం దొంగతనాల

నిందితుల వివరాలు జనగామ జిల్లా(Jangaon District), లింగాల ఘణపురంకు చెందిన కేవిడి గణేష్(Ganesh) (22), నారపల్లి దివ్య నగర్ లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. పార్ట్ టైం లో రాపిడో వాహనం నడుపుతాడు. అదే జిల్లా, లింగాలఘణపుర్ మండలం, నేరుట్ల గ్రామానికి చెందిన రాగుల లక్ష్మణ్(Ragula Lakshman) (22) కూలి పని చేసుకుంటాడు. వీరిద్దరూ చిన్నప్పటినుంచి స్నేహితులు. లోన్ ఆప్(Lone App) లకు బెట్టింగులకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలను ఎంచుకున్నారు. చైన్ స్నాచింగ్(Chain snatching) ఎలా చేయాలో యూట్యూబ్(Youtube) లో వీడియోలు చూసి నేర్చుకొని, దొంగతనానికి పాల్పడ్డారు.

అందులో భాగంగానే ఈనెల తొమ్మిదిన అంశాపూర్ లో కాంతమ్మ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్ళారు. పుస్తెలతాడును జనగామలోని ముత్తూట్ ఫైనాన్స్ లో తనకా పెట్టి రెండు లక్షల, 25 రూపాయలను తీసుకున్నారు. ఇద్దరు డబ్బులు పంచుకోగా. గణేష్ ఐఫోన్ కొనుగోలు చేసాడు. దొంగతనానికి వాడిన బైక్, ఐఫోన్, ముతూట్ కార్పొరేషన్ రిసిప్ట్ లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని తెలిపారు.

Also Read: Crime News: మాయమాటలతో మైనర్ బాలికపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు..?

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది