Gandipeet land kabja
క్రైమ్

Hyderabad:ప్రభుత్వ భూమికి ‘గండి’కొట్టిన బీఆర్ఎస్ నేత

Gandipeta government land illigally occupaied brs leader:
కొంతమంది భూబకాసురులు ఒక స్థలం పై గురి పెట్టారంటే ఎన్ని ఎత్తుగడలు వేసైనా తమ వశం అయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుల్లా ఎంతకైనా తెగిస్తారు అనేందుకు మచ్చుకు ఉదాహరణ ఇది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా గురైంది. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల భూమిని బీఆర్ఎస్ పార్టీ లీడర్ కబ్జా చేసినట్టు సమాచారం. కబ్జా చేసిన భూములకు పట్టా పాస్ బుక్కులు సంపాదించినట్టు తెలుస్తుంది. అప్పటి బీఆర్ఎస్ మంత్రి సహకారంతో కలెక్టర్ ను ప్రభావితం చేసి అడ్డదారిన పట్టా పాస్ బుక్కులు పొందినట్టు సమాచారం.

తహశీల్దార్ అండతో..

కబ్జా చేసిన కోట్ల రూపాయల విలువ చేసే భూమిని గండిపేట తహశీల్దార్ కాపాడారని స్థానికులు గుసగుసలాడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో ప్రహరీ గోడను నేలమట్టం చేశారు. అడ్డదారిని సంపాదించిన పట్టా పాస్ బుక్కులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శషాంకా క్యాన్సెల్ చేశారు. దీనిపై విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు రెవెన్యూ అధికారులు.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?