Tamilnadu : తమిళనాడులో కన్నీళ్లు తెప్పించే ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఒకేసారి నలుగురు యువకులు ప్రాణాలు ఒదిలారు. చర్చ్ ఏర్పాట్లలో ఉండగా.. సడెన్ గా జరిగిన ఈ ప్రమాదంలో.. అందరూ చూస్తుండగానే కొట్టుకుంటూ ఆ నలుగురు యువకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు.
తమిళనాడులోని కన్యాకుమారి (Kanyakumari) జిల్లాలో బద్ధంతురై చర్చ్ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న నలుగురు యువకులు లైటింగ్ ఏర్పాటు చేసే పనుల్లో ఉండిపోయారు. సడెన్ గా కరెంట్ పాస్ కావడంతో ఆ నలుగురు యువకులు గిలాగిలా కొట్టుకుంటూ కిందపడ్డారు. చుట్టూ ఉన్న వారు కాపాడేలోపే ప్రాణాలు కోల్పోయారు.