Fake Video Of Teen Lying In Front Of Bus Fuels Road Safety Concern
క్రైమ్

Fake Video: అదంతా ఫేక్‌ అంటూ ఆర్టీసీ ఎండీ ఫైర్

Fake Video Of Teen Lying In Front Of Bus Fuels Road Safety Concern: అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న క్రమంలో కుర్రకారు చేష్టలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. వారి చేష్టలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. అంతేకాకుండా టెక్నాలజీని వినియోగిస్తూ చేసే మార్పింగ్‌ కారణంగా నిజం ఏదో, అబద్ధం ఏదో గుర్తించడానికి వీలు లేకుండా పోతోంది. మరోవైపు రీల్స్ పిచ్చి ఎక్కువైంది. లైక్స్, ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు రకరకాల స్టంట్స్‌ చేస్తూ హడలెత్తిస్తున్నారు. రీల్స్‌ మోజులో పడి వాళ్లు ఇంతకీ ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు.

తాజాగా రిలీజైన ఓ వీడియో కూడా అలాంటిదే. అంతేకాదు గతకొన్ని రోజులుగా ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వీడియో హైదరాబాద్‌ మహానగరంలోని రద్దీగా ఉన్న యూసఫ్‌గూడ రోడ్డు అది అంటూ క్యాఫ్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసినోళ్లకు ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఓ ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్తోంది. ఉన్నట్టుండి ఓ యువకుడు బస్సుకు అడ్డంగా వచ్చి రోడ్డుపై పడుకున్నాడు. అతడిపై నుంచి బస్సు వేగంగా దూసుకుపోయింది. బస్సు వెళ్లిన తర్వాత ఎంచక్కా లేచి నిల్చుని ఒంటిపై దుమ్ము దులుపుకొని పక్కకెళ్లిపోతాడు. ఆ పని చేసిన కుర్రాడిని చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో చివాట్లు పెడుతున్నారు. నిజానికి అది ఒరిజినల్ వీడియో కాదు. ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు ఓ ఆకతాయి చేసిన ఫేక్ వీడియో. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పిచ్చి పనులు ఎక్కువయ్యాయి యువతకి.అయితే అతడు సరదా కోసం చేసినప్పటికీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాత్రం సీరియర్ అయ్యారు.

Also Read: ‘కోల్’కో లేని దెబ్బ

ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు టీజీ ఆర్టీసీ బాస్.సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియో ఫేక్‌. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్‌ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలి చేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిటెడ్‌ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్