Nude video Call to MLA: సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీ (Celebrity)ల దాకా వాళ్ల ఉచ్చులో పడి దోపిడి (Cyber Extortion) కి గురవుతున్నారు. తాజాగా నకిరేకల్ (Nakrekal) ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veersham)కు న్యూడ్ కాల్ (Nude video Call) చేసిన సైబర్ కేటుగాళ్లు ఆ వీడియోను రికార్డ్ (Record) చేసి డబ్బులు (Money) డిమాండ్ (Demand) చేశారు. ఇవ్వకపోతే… రికార్డ్ చేసిన వీడియోను నియోజకవర్గమంతా (Constituency) సర్క్యులేట్ చేస్తామని బెదిరించారు. వీరేశం వాళ్ల బెదిరింపులకు లొంగకపోవడంతో అన్నంత పనిచేశారు. దాంతో ఆయన పోలీసుల (Police)ను ఆశ్రయించక తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే… ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఓ వీడియో కాల్ వచ్చింది. ఆ సమయంలో ఆయన తన అనుచరులతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుండగా వీడియో కాల్ రావడంతో ఆయన లిఫ్ట్ చేశారు. ఎత్తిన తర్వాత అర్థమైంది అది న్యూడ్ కాల్ అని. దీంతో ఆయన వెంటనే కాల్ కట్ చేశారు. అయితే వీరేశం కాల్ లిఫ్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే దుండగులు స్క్రీన్ రికార్డ్ చేశారు. వెంటనే ఆ రికార్డు చేసిన వీడియోను ఎమ్మెల్యేకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు. తాము అడిగినంత ఇవ్వకపోతే… న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతున్న నకిరేకల్ ఎమ్మెల్యే అని కాంగ్రెస్ (Congress) నేతల(Leaders)కు పంపుతామని బెదిరించారు. వీరేశం వాటిని లైట్ తీసుకుని స్పందించలేదు. కానీ సీరియస్ గా తీసుకున్న దుండగులు… రికార్డ్ చేసిన వీడియోను నియోజకవర్గంలోని కొంతమందికి పంపారు. ఆ వీడియో చూసిన ఆయన అభిమానులు, అనుచరులు కంగుతిన్నారు. వెంటనే ఆయనకు సదరు వీడియోను ఫార్వార్డ్ (Forward) చేసి… తమకు ఈ వీడియోలు పంపారని తెలియపరిచారు. దాంతో షాక్ కు గురైన వీరేశం.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.