Digital Arrest Scam (imagecredit:twitter)
క్రైమ్

Digital Arrest Scam: డిజిటల్​ అరెస్ట్ పేర బెదిరింపులు.. భరించలేక గుండెపోటుతో డాక్టర్ మృతి

Digital Arrest Scam: డిజిటల్ అరెస్టుల పేర సైబర్ క్రిమినల్స్ వరుసగా నేరాలు చేస్తున్నారు. వృద్ధులను టార్గెట్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులమని బెదిరిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు. ఇటీవలిగ ఈ తరహా నేరాలు అధికమవుతుండగా వీరి బారిన పడి ఓ డాక్టర్ గుండెపోటుకు గురై చనిపోవటం గమనార్హం. వరుసగా డిజిటల్ అరెస్ట్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో సైబర్​ క్రైం పోలీసులు అలర్ట్ అయ్యారు. వేర్వేరు దర్యాప్తు సంస్థల అధికారులమని చెప్పి వచ్చే ఫోన్ కాల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ దార కవిత చెప్పారు. పోలీసులుగానీ…ఇతర దర్యాప్తు సంస్థలుగానీ డిజిటల్ అరెస్టులు చేయవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇలాంటి ఫోన్లు వస్తే డబ్బు ట్రాన్స్ ఫర్ చెయ్యకుండా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

కొన్ని నిదర్శనాలు..

ఈనెల 5న హైదరాబాద్ లో నివాసముంటున్న డాక్టర్ సీతాదేవికి సైబర్ క్రిమినల్స్ వాట్సాప్ వీడియో కాల్​ చేశారు. సీతాదేవితోపాటు ఆమె కుమారుడు కీర్తి హరీష్​ తో కూడా మాట్లాడి తమను తాము లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులుగా చెప్పుకొన్నారు. మీ ఇద్దరి మీద కేసులు నమోదయ్యాయని బెదిరించి మూడు రోజుల వ్యవధిలో 6.60లక్షలు ట్రాన్స్​ ఫర్ చేయించుకున్నారు. ఆ తరువాత కూడా బెదిరింపులు కొనసాగించటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సీతాదేవి గుండెపోటుతో కన్నుమూసింది.

సికింద్రాబాద్ లో ఉంటున్న 68 ఏళ్ల వృద్ధునితో ఆకాశ్ చౌదరి అనే వ్యక్తి తనను తాను సీబీఐ అధికారిగా చెప్పుకొని వాట్సాప్ వీడియో కాల్ లో మాట్లాడాడు. నీ మీద కేసులు నమోదయ్యాయి…అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించి వెరిఫికేషన్ పేర కోటీ 38లక్షల రూపాయలను తాను చెప్పిన ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయించాడు. మరో లక్షా 75వేలు అడగటంతో సైబర్ మోసగాళ్ల పని అని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా గడిచిన నెలరోజుల్లోనే అయిదుకు పైగా నేరాలు జరిగాయి.

Also Read: Sandeep Reddy Vanga: సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా .. త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్

పోలీస్ యూనిఫాంలలో..

ఇలా మోసాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్ పోలీస్ యూనిఫాంలు ధరించి వాట్సాప్ వీడియో కాల్స్ లో మాట్లాడుతుండటం గమనార్హం. ఫేక్ ఐడెంటిటీ కార్డులు చూపించి బెదిరిస్తున్నారు. ఫోర్జరీ అరెస్ట్ వారెంట్లు చూపిస్తున్నారు. అవతలి వారిని నమ్మించటానికి వారి ఆధార్ కార్డుల నెంబర్లు చెబుతున్నారు. దీనిపై సైబర్ క్రైం విభాగానికి చెందిన ఓ అధికారితో మాట్లాడగా ఆధార్ కార్డుల వివరాలను సైబర్ క్రిమినల్స్ వేర్వేరు దారుల్లోసంపాదించుకుంటున్నారని చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పని చేసే బ్రోకర్లు, ఫైనాన్స్​ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు డబ్బు ఇచ్చి ఈ డేటాను సేకరిస్తున్నట్టు తెలిపారు. ఆ తరువాత వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఫోన్ కాల్స్ చేస్తున్నారన్నారు. జీవితపు చరమాంకంలో ఉన్న వృద్ధులు ఈ వయసులో అరెస్టయితే ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న మంచిపేరుతోపాటు కుటుంబ పరువు ప్రతిష్టలు పోతాయన్న భయంతో సైబర్ క్రిమినల్స్ ఉచ్ఛులో చిక్కుకుంటున్నారన్నారు.

అస్సలు నమ్మొద్దు..

ఈ నేరాలపై సైబర్ క్రైం డీసీపీ దార కవిత మాట్లాడుతూ వేర్వేరు దర్యాప్తు సంస్థల అధికారులమంటూ అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వాట్సాప్ వీడియో ఫోన్ కాల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సూచించారు. పోలీసులు. ఇతర దర్యాప్తు సంస్థల అధికారులు ఇలా వాట్సాప్ వీడియో కాల్స్ చేసి ఏ కేసులోనూ విచారణ చేయరని చెప్పారు. నిజంగా ఏవైనా కేసులు నమోదైతే ప్రత్యక్షంగా వచ్చి ప్రశ్నిస్తారన్నారు. ఇక, డిజిటల్​ అరెస్టులు ఉండనే ఉండవన్నారు. వెరిఫికేషన్ పేర డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని దర్యాప్తు సంస్థలు అడగవన్నారు. ఇలాంటి వారి బెదిరింపులకు భయపడి బ్యాంక్ అకౌంట్ల వివరాలు, ఓటీపీ నెంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వొద్దని సూచించారు. భయంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ఇలాంటి ఫోన్లు వస్తే కుటుంబ సభ్యులకు చెప్పాలన్నారు. వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు. దాంతోపాటు 193‌‌0 నెంబర్​ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. www.cybercrime.gov.in అన్న వెబ్​ సైట్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. cybercrimePSHyd తో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ఎక్స్ ఖాతాకు కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చని తెలిపారు.

Also Read: Land Encroachment: భూ కబ్జాలపై సర్కార్ షాక్?.. హైడ్రా ఆపరేషన్ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకి?

Just In

01

OG Movie: ‘మిరాయ్’ మాత్రమే కాదు.. ‘లిటిల్ హార్ట్స్’ థియేటర్లు కూడా.. బన్నీ వాసు సంచలన ప్రకటన

OTT Movie: బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో మాఫియా డాన్ తో సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే?

Smiling Emoji Murder: తాత మరణంపై ఫేస్ బుక్ పోస్ట్.. స్మైలింగ్ ఎమోజీ పెట్టాడని.. యువకుడి హత్య

OTT Movie: ఫ్యామిలీ సీక్రెట్ తెలుసుకునే క్రమంలో బయటపడిన డెడ్ బాడీ.. ఏం జరిగిందంటే?

OG Movie: గంటకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!