Crime News | భార్యకు మెసేజ్ లు పంపితే చేతులు నరికిన భర్త..!
Crime News
క్రైమ్, విశాఖపట్నం

Crime News | భార్యకు మెసేజ్ లు పంపిన వ్యక్తి.. చేతులు నరికిన భర్త..!

Crime News | ఈ రోజుల్లో వివాహేతర సంబంధం పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోంది. ప్రాణాలు తీసే స్థాయికి తీసుకెళ్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని దారుణాలు వెలుగు చూస్తున్నా సరే చాలా మంది అక్రమ సంబంధంను వీడట్లేదు. ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం (illegal affair) పెట్టుకున్నాడని.. ఏకంగా చేతులు నరికేశాడు భర్త. నిడమర్రు మండలం బావాయిపాలెంకు చెందిన మజ్జి ఏసురాజు (esuraju) హత్య కేసు ఏపీలో సంచలనం రేపింది. ఎందుకంటే అతని కుడిచేయిని నరకడంతో అతను చనిపోయాడు.

కానీ ఆ కుడి చేయి ఇన్ని రోజులుగా అస్సలు దొరకలేదు. దాంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. అతన్ని ఎవరు చంపారా అని ఆరా తీయగా.. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసురాజు కొంత కాలంగా ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ వివాహిత భర్తకు ఈ విషయం తెలియడంతో ఇద్దరిని మందలించాడు. తన భార్యతో సంబంధం పెట్టుకోవద్దని ఏసురాజుకు చాలా సార్లు చెప్పాడు. అయినా సరే ఏసురాజు వినకుండా అలాగే రెచ్చిపోయాడు.

శనివారం రాత్రి మండలంలోని ఓ గ్రామంలో తన భార్యతో ఏసురాజు ఉన్నాడని తెలుసుకుని.. ఆమె భర్త రగిలిపోయాడు. వెంటనే తన తండ్రికి ఈ విషయం చెప్పాడు. మరో వ్యక్తి సాయం తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి ఏసురాజును బావాయిపాలెం తీసుకొచ్చారు. తన భార్యకు పదే పదే మెసేజ్ లు పంపుతున్నాడని ఏసురాజు కుడిచేతిని నరికి దూరంగా విసిరేశాడు ఆమె భర్త. ఆ తర్వాత ఏసురాజును కాపవరంలోని కాలువ వద్ద పడేసి ముగ్గురూ పారిపోయారు. చేతినుంచి విపరీతంగా రక్తం కారడంతో ఏసురాజు అక్కడే చనిపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?