Crime News (imagecredit:twitter)
క్రైమ్

Crime News: నమ్మి పనిలో పెట్టుకున్నారు… నమ్మించి కాటేశారు?

Crime News: నమ్మి పనిలో పెట్టుకుంటే కోట్ల రూపాయల విలువ చేసే సొత్తు, నగదు కొల్లగొట్టి ఉడాయించిన నేపాలీ గ్యాంగ్ కోసం తూర్పు మండలం పోలీసులు వేటను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో డీసీపీ బాలస్వామి శనివారం ముఠా సభ్యుల ఫోటోలను విడుదల చేశారు. వారి గురించి తెలిస్తే సమాచారం అందించాలని కోరారు. వివరాల్లోకి వెళితే…బాగ్ లింగంపల్లి నివాసి హేమరాజ్​ వ్యాపారి. కొన్నిరోజుల క్రితం నేపాల్ దేశానికి చెందిన వారు ఆయన ఇంట్లో పనికి కుదిరారు.

ఇటీవల రాత్రి భోజనంలో మత్తు మందు క​లిపి హేమరాజ్​ అతని భార్యకు ఇచ్చారు. అది తిని ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఇంట్లో ఉన్న 2 కిలోల బంగారు నగలు, 2 కోట్ల రూపాయల నగదుతో ఉడాయించారు. ఈ మేరకు కాచిగూడ పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు.

Also Read: GHMC Revenue: ఎర్లీ బర్డ్ దూకుడు .. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎక్కువే!

అయితే, ఇప్పటివరకు వారి ఆచూకీ తెలియలేదు. కాగా, గ్యాంగ్​ సభ్యులు దేశ సరిహద్దులు దాటి నేపాల్ కు వెళ్లే అవకాశాలు ఉండటంతో పోలీసులు దేశవ్యాప్తంగా వీరిపై లుక్​ ఔట్​ నోటీసులు జారీ చేశారు. ముఠా సభ్యుల గురించి తెలిస్తే 8712660501, 8712660503, 8712660506, 8712660509, 8712660540, 8712660541 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!