Drugs Crime (imagecredit:swetcha)
క్రైమ్

Drugs Crime: డ్రగ్ రాకెట్లో కానిస్టేబులే సూత్రధారి.. గ్యాంగ్ సభ్యుల ద్వారా డ్రగ్స్​దందా!

Drugs Crime: కూకట్ పల్లి ప్రాంతంలో పట్టుబడ్డ డ్రగ్ రాకెట్ లో కానిస్టేబులే ప్రధాన సూత్రధారిగా నిర్ధారణ అయ్యింది. తేలికగా డబ్బు సంపాదించేందుకు అతనే గ్యాంగ్ సభ్యుల ద్వారా డ్రగ్స్​దందా నడిపిస్తున్నట్టు తేలింది. బాలానగర్ జోన్ ఇన్​ఛార్జ్ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్​తో కలిసి వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన గుణశేఖర్ ఆర్మ్ డ్ రిజర్వడ్ కానిస్టేబుల్. గతంలో ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ వద్ద గన్ మెన్ గా పని చేశాడు. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గుణశేఖర్​ తేలికగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్​దందా మొదలు పెట్టాడు.

కొకైన్​మిక్స్ డ్ ఎఫిడ్రిన్ డ్రగ్

బెంగళూరుకు చెందిన అప్పన్న నుంచి కొకైన్​మిక్స్ డ్ ఎఫిడ్రిన్ డ్రగ్ ను తీసుకు వచ్చి ఆంధ్రప్రదేశ్​లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్న ఉన్నం సురేంద్ర (31), దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి (38), చేగూడి మెర్సీ మార్గరెట్ (34), షేక్ మస్తాన్ వలీ (40), దేవరాజు యేసుబాబు (29)తో కలిసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. ఇటీవల బెంగళూరు వెళ్లి అప్పన్న నుంచి కోటి రూపాయల విలువ చేసే డ్రగ్ తీసుకుని తిరుపతికి వచ్చాడు. దీనిని సురేంద్ర తీసుకుని గుంటూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడు. అప్పటికే గ్యాంగ్ లోని మిగితా సభ్యులు కూకట్ పల్లి జయనగర్​ ప్రాంతంలో ఉన్నారు. అంతా కలిసి భాగ్యనగర్ వైపు వెళుతుండగా ఎస్వోటీ అధికారులు కూకట్ పల్లి పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. వారి నుంచి డ్రగ్ ను సీజ్ చేశారు. కానిస్టేబుల్​ గుణశేఖర్, అప్పన్నలు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.

Also Read: KTR: అరెరే.. కేటీఆర్‌కు పెద్ద చిక్కొచ్చి పడిందే.. ఆధారాలతో దిమ్మతిరిగేలా కొట్టారుగా!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు