Chaddi Gang Hulchul (imagecredit:AI)
క్రైమ్

Chaddi Gang Hulchul: చోరీకి వచ్చిన చెడ్డీ గ్యాంగ్.. ఇంట్లో దూరి.. ఏం చేశారంటే?

వరంగల్ స్వేచ్ఛ: Chaddi Gang Hulchul: దొంగల ముఠా దొంగతనం చేసేందుకు పెద్ద స్కెచ్చే వేశారు. ముసుగులు ధరించి, కత్తులతో ఇంట్లోకి చొరబడి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఇంట్లో ఏమి దొరక్క పోవడంతో దొరికినవే బంగారం అనుకుని వెనుదిరిగిన ఆసక్తికరమైన సంఘటన హన్మకొండలోని విద్యారణ్యపురిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యారణ్యపురి లోని బత్తిని వెంకటనారాయణ ఇంట్లో గురువారం అర్ధరాత్రి తరువాత ఆరుగురు సభ్యులతో కూడిన చెడ్డీ గ్యాంగ్ చొరబడి ఇంట్లోని బంగారం కోటింగ్ ఉన్న రెండు సిల్వర్ కైన్స్, అసలు నగలు అనుకుని గిల్ట్ నగలు ఎత్తుకు వెళ్ళారు.

పెద్ద స్కెచ్ తో వచ్చిన దోపిడి దొంగల ముఠా ఇలా మోసపోయి తిరిగి వెళ్ళడం ఇప్పుడు వరంగల్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ నిర్వహిస్తున్నామని హనుమకొండ ఎస్.హెచ్.వో. సతీష్ తెలిపారు. కాగా భారీ మొత్తంలో దొంగతనానికి స్కెచ్ వేసిన చెడ్డి గ్యాంగ్ కేవలం రెండు సిల్వర్ కైన్స్, గిల్ట్ నగలు మాత్రమే అపహరించుకు పోవడంతో పెద్ద నష్టం తప్పినట్టు అయ్యింది.

ఉత్తర భారత దేశం నుంచి వచ్చినట్టు పోలీసుల అనుమానం  

అంతర్రాష్ట్ర ముఠా వరంగల్ లోని ఓ మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి, హనుమకొండకు చేరుకుని అనంతరం హనుమకొండ పరిధిలోని కాకతీయ యూనివర్సిటీ ఫేస్ -1 పరిధిలోకి వచ్చే ఓ ఇంట్లో సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి, ఇంటి కిటికీల నుండి ఇంట్లోకి చొరబడి కత్తులతో ఇంట్లో ఉన్న బీరువాను పగలోకిట్టినట్లుగా సమాచారం. ముఠాలో ఉన్న ఆరుగురి చేతులపై టాటూలు గుర్తించి, నిందితుల్లో ఒకరి ఫిగర్ ప్రింట్ ఆధారంగా ఈ అంతర్రాష్ట్ర ముఠా అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

హనుమకొండలో గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన దొంగతనం తీరును పరిశీలించిన పోలీసులు ఉత్తర భారత దేశం నుంచి వచ్చిన చెడ్డి గ్యాంగ్ దొంగతనానికి ప్రయత్నం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ముఠా దొంగతనాల కోసం ఎంతకైనా తెగిస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. నిర్మానుస్య ప్రదేశాల్లో నివాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు తారాస పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Also Read: Fake Mehendi: మెహందీ కొంటున్నారా? అయితే ఈ స్కామ్ గురించి తెలుసుకోవాల్సిందే!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ