MLC Kavita backlash in liquor scam
క్రైమ్

Delhi Liquor Case: కవితకు కోర్టులో చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ వేసిన ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. చిన్న కుమారుడికి పరీక్షలు జరుగుతున్నాయని, ఈ సమయంలో తల్లిగా తన కొడుకుకు సహాయకారిగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉన్నదని కవిత పిటిషన్ వేసింది. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని కోరింది. కానీ, ఈడీ ఈ పిటిషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని, బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేసే ముప్పు ఉందని వాదించింది. ఇదేమీ మావనవతా కోణానికి సంబంధించిన అంశం కాదని పేర్కొంది. ఉభయ పక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టి సోమవారానికి వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె జ్యుడీషియల్ రిమాండ్ రేపటితో ముగియనుంది. మళ్లీ ఆమె రిమాండ్‌ను కోర్టు పొడిగించే అవకాశం ఉన్నది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇతర నిందితుల రిమాండ్‌ను కూడా ఇలాగే కోర్టు పొడిగిస్తూ వస్తున్నది. తాజాగా ఆమె దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో సాధారణ బెయిల్ పై త్వరగా విచారణ చేపట్టాలని కవిత కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు కవిత న్యాయమూర్తి దరఖాస్తు చేసే అవకాశం ఉన్నది. రెగ్యులర్ బెయిల్ పై తదుపరి విచారణ 20వ తేదీన జరగనున్నట్టు గత విచారణలో న్యాయమూర్తి కావేరీ బవేజా వాయిదా వేశారు.

Also Read: నా ఫోన్, నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు: ఈటల

ఈడీ విచారించిన తర్వాత ఆమె తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంటున్నారు. ఇంతలోనే సీబీఐ ఆమెను విచారించడానికి అనుమతి కావాలని రౌస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. కోర్టు అందుకు అనుమతించింది. ఇంకా సీబీఐ ఆమెను విచారించాల్సి ఉన్నది. సీబీఐ విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిసింది. ఒక వేళ సీబీఐ ఆమెను కస్టడీలోకి తీసుకునే అవకాశాలూ ఉన్నాయని సమాచారం.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు