Balgalore rave party
క్రైమ్

Bangalore: దమ్ మారో దమ్! ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ

– 30 మంది యువతులు, 71 మంది పురుషులు
– ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని ఫాంహౌస్‌ అడ్డాగా రేవ్ పార్టీ
– హాజరైన టెక్కీలు, సినీ ప్రముఖులు
– పక్కా సమాచారంతో పోలీసుల రెయిడ్
– భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌
– ఫాంహౌస్ ఓనర్ గోపాల్ రెడ్డిగా గుర్తింపు
– అందరి బ్లడ్ శాంపిల్స్ సేకరణ
– రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసు సహా నలుగురి అరెస్ట్

Bangalore-Hyderabad outskirts rave party Tollywood actors seize cocaine: ప్రధాన నగరాల్లో వీకెండ్ వచ్చిందంటే చాలు, మందు, చిందుతో యువత రెచ్చిపోతోంది. రేవ్ పార్టీల పేరిట బ్యాడ్ కల్చర్ పంజా విసురుతోంది. మూడంకెల జీతాలు అందుకుంటూ వీకెండ్‌లో రెండు రోజులు సరాదాగా గడుపుదామనుకునే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. మందేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ తమను తాము మరచిపోయి అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో చాలామంది తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో బెంగళూరు సిటీ శివారు ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. జీఆర్ పేరుతో ఉన్న ఫాంహౌస్‌లో ఉదయం 3 గంటల వరకు రేవ్ పార్టీ జరిగింది. దీనిపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు రెయిడ్ చేశారు. ఈ దాడుల్లో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మూడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు

ఈ రేవ్ పార్టీకి మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. మొత్తం 101 మంది పార్టీలో పాల్గొనగా, వారిలో 71 మంది పురుషులు, 30 మంది యువతులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి తన బర్త్ డే సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. జీఆర్‌ ఫాంహౌస్‌ అనేది హైదరాబాద్‌‌ లో ఉండే గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది.

బ్లడ్ శాంపిల్స్ సేకరణ

రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరిగింది. పోలీసులకు సోదాల సమయంలో డ్రగ్స్‌ లభ్యమయ్యాయి. పట్టుబడ్డ వారందరినీ పీఎస్‌కు తరలించారు. అక్కడ మెడికల్ టీమ్స్‌ను పిలిపించి అందరి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసుతోపాటు నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ ఎమ్మెల్యే ఉన్నారా?

ఫాంహౌస్‌లో ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ స్టికర్ ఉన్న కారు ఒకటి కనిపించింది. దీంతో ఆయన పార్టీలో పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆ కారు తనది కాదని వివరణ ఇచ్చారు. అనవసరంగా తన పేరును వాడుతున్నారని ఆరోపించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో మోడల్స్, టెకీలు, తెలుగు సినిమా నటీమణులు ఉన్నారు. పట్టుబడ్డ వారిలో నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, తాను హైదరాబాద్‌లో ఉన్నట్లుగా ఆమె వివరణ ఇచ్చింది. కానీ, పోలీసులు ఆమె ఫోటోను రిలీజ్ చేయడంతో బిగ్ ట్విస్ట్ నెలకొంది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు